ఇక ‘మన సీ్త్రనిధి’తో రుణాలు
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు సీ్త్రనిధి ద్వారా అందించే రుణాల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రుణాలు అవసరమైన వారు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ కిస్తీలు సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. అలాగే సభ్యులు చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయిందో లేదో సమాచారం సరిచూసుకోవచ్చు. దీంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగం వంటి అక్రమాలకు చెక్ పడనుంది.
స్వయం సమృద్ధిని సాధించేలా ..
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తోంది. ఇంటి వద్దనే ఉండి వివిధ వ్యాపారాలు నిర్వహించేలా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తు అతివలకు అండగా నిలుస్తోంది.
దరఖాస్తు, పర్యవేక్షణ సులభతరం
సీ్త్రనిధి రుణాల మంజూరు, చెల్లింపుల పరిశీలన సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘మన సీ్త్రనిధి’ పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రుణాలు అవసరమైన సభ్యులు గతంలో సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసి వీవోలు తీర్మానం చేసి రుణాలు కేటాయించేవారు. దీంతో వారిని బతిమాలడంతో పాటు ఎంతో కొంత సమర్పించాల్సి వచ్చేది. ఈ యాప్ ద్వారా దానికి తెరపడనుంది. వీవోఏలు, సీసీల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో వీవోఏకు వెళ్తుంది. 24గంటల్లో దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే సంబంధిత ఏపీఎంకు వెళ్తుంది. ఆయన పరిశీలించి అసిస్టెంట్ మేనేజర్ సీ్త్రనిధికి పంపిస్తారు. వారు ఆమోదం తెలిపితే రీజినల్ మేనేజర్ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే రుణం నేరుగా సభ్యుల్లో ఖాతాల్లోకి చేరుతుంది. తద్వారా సభ్యుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
అక్రమాలకు చెక్..
గతంలో రుణాలు పొందిన సభ్యులు తిరిగి కడుతున్నారో లేదో తెలిసేది కాదు. కానీ ఈ యాప్‌లో సభ్యులు తీసుకున్న రుణాల సమగ్ర సమాచారం నమోదై ఉంటుంది. ఏ సభ్యురాలు ఎంత రుణం తీసుకున్నారు, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది వంటి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే రుణ చెల్లింపులు కూడా ఇంటి నుంచే నేరుగా చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా పొతోంది. అయితే జిల్లాలో కొంతమంది సంఘాల అధ్యక్షులు సీ్త్రనిధి వాయిదాల సొమ్మును సభ్యులకు తెలియకుండానే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా సభ్యుల పర్యవేక్షణ పెరిగి ఇలాంటి అక్రమాలు, మోసాలకు చెక్‌పడే అవకాశముంది.
జిల్లాలో..
గతేడాది సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.39కోట్లు
మంజూరు చేసింది రూ.42కోట్లు
ఈ ఏడాది పంపిణీ లక్ష్యం రూ.36 కోట్లు(5,418 మంది సభ్యులకు)
ఇప్పటివరకు మంజూరు చేసింది
రూ.18 కోట్లు
సభ్యులకు ఎంతో ప్రయోజనం
సీ్త్రనిధి రుణాలు పొందాలనుకునే వారు, ఇది వరకు రుణాలు తీసుకున్న వారు స్మార్ట్‌ఫోన్లలో మన సీ్త్రనిధి యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌డోల్ చేసుకోవాలి. రుణాల కోసం నేరుగా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. చెల్లించాల్సిన వాయిదాల వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. దీంతో సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరనుండగా అక్రమాలకు అడ్టుకట్టపడనుంది.
– పూర్ణచందర్, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్


