‘ముస్లిం తెలి’ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
కై లాస్‌నగర్: ముస్లిం తెలి సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. పట్టణానికి చెందిన నాలుగు జంట లు, మహారాష్ట్రలోని కిన్వట్, పొండ్రకవడ, యావత్మాల్, ఇచ్చోడ ప్రాంతాలకు చెందిన మ రో ఏడు జంటలు కలిపి 11 జంటలకు మత ఆ చారం ప్రకారం నిఖా జరిపించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఈ సామూహిక వేడుకకు సమాజ్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు జహీర్ రంజానీ మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో తెలి సమాజ్ ఆధ్వర్యంలో సామూహిక వి వాహాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇక ఏటా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇందులో జావిద్, మోబిన్, మినహజ్, పాల్గొన్నారు.


