‘రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలు’
ఆదిలాబాద్‌టౌన్: సోయా కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న ఆదిలాబాద్ బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. సోయా కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మానసిక స్థితితో ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో రైతులకు బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని అన్నారు. వారికి మద్దతుగా తలపెట్టిన బంద్‌లో అన్ని వ ర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో నాయకులు ప్రహ్లాద్, సజీ తొద్దీన్, రమేశ్ తదితరులున్నారు.


