ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివా సంలో గురువారం పీఆర్టీయూ, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్‌సింగ్, నర్ర నవీన్‌యాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మూ గ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జాదవ్ అశోక్‌కుమార్, నాయకులు బెజ్జంకి రవీంద్ర, శీతల్ చౌహాన్, బత్తురి సంతోష్, చంద్రశేఖర్, చిలుక విలాస్, జాదవ్ రమేశ్, సత్యనారాయణ, పోచారెడ్డి, ధర్మేందర్, ఎస్.అశోక్, ముమ్మడి మల్లేశ్ తదితరులున్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: విద్యారంగ సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కా ర్యాలయంలో టీఎస్ యూటీఎఫ్, పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. భవిష్యత్‌లో విద్యారంగాన్ని బలోపేతం చే సేందుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చా రు. పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా ని ర్వహించిన ఉపాధ్యాయులను అభినందించా రు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కిష్టన్న, వీ అశోక్, నాయకులు శ్రీనివాస్, స్వామి, గౌస్ మొహియుద్దీన్, ఏ ఇస్తారి, సీ విలాస్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్‌సింగ్, నర్ర నవీన్‌యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విఠల్‌గౌడ్ తదితరులున్నారు.


