పకడ్బందీగా యూరియా పంపిణీ
ఇచ్చోడ: యాప్ ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా జరుగుతోందని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్‌చార్జి నోడల్ అధికారి కనకరాజు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వ్యవసాయశాఖ సిబ్బందితో గ్రామాల వారీగా రైతులకు యా ప్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, ఏవో తిరుమల, ఏఈవో సంజీవ్‌నాయక్ తదితరులున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో యూరియా కొరత లేద ని వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన జిల్లా నో డల్ అధికారి కనకరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరా, బుకింగ్ యాప్ విని యోగం గురించి ఆరా తీశారు. రైతులతో మాట్లాడి బుకింగ్ విధానం, సరఫరా ప్రక్రియ, స్టాక్ అప్‌డేట్, ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. గతంలో యూరియా కోసం రైతులు ఒక మండలం నుంచి మరో మండలానికి తిరగాల్సి వచ్చేదని, ఎక్కడ స్టాక్ ఉందో తెలియక సమయం, ఖర్చు వృథా అయ్యేదని తెలిపారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా సరఫరాతో రైతులకు ప్రయోజనం కలిగిందని వివరించారు. ఆయన వెంట డీఏవో శ్రీధర్‌స్వామి తదితరులున్నారు.


