నేటి నుంచి బీఆర్‌ఎస్ ఆందోళనలు
ఆదిలాబాద్‌టౌన్: రైతుల పంట ఉత్పత్తుల కొనుగో ళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నాయని, ఇందుకు నిరసనగా ఆందోళన బాట పట్టనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోళ్లు సజావుగా సాగించేందుకు కలెక్టర్ త్రీమెన్ కమిటీ వేశారని, ఆ కమిటీ ని ర్ధారించిన పంట మార్కెట్‌కు వచ్చి వెనక్కిపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జైనథ్ మండలం కాప్సి ఎక్స్ రోడ్డు వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపట్టి అధికా రులు స్పష్టమైన ప్రకటన చేసేదాకా కొనసాగిస్తామని తెలిపారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి, సోమవారం కలెక్టరేట్ ముట్టడి, మంగళవారం ఆదిలాబాద్ బంద్ కార్యక్రమాలు తలపెట్టినట్లు పేర్కొన్నారు. బంద్‌లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని కోరారు. నాయకులు లింగారెడ్డి, సాజిదొద్దీన్, యూనీస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.


