పోస్టర్ ఆవిష్కరణ
కై లాస్‌నగర్: ఈ నెల 1నుంచి 30వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రత మా సోత్సవ కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడు తూ.. ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం ఏ టా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అడిషన్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రవీందర్‌కుమార్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం రోడ్డు భద్రత మాసోత్సవాల ను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రవీందర్‌కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 1నుంచి 30వరకు రోడ్డు భద్రత మాసోత్సవా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు తప్పకుండా పా టించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీవో ఎస్.శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతి మారెడ్డి, ఎంవీఐలు శ్రీనివాస్, ప్రదీప్, అశ్వంత్‌కుమార్, ఆర్టీఏ సభ్యుడు రాజేశ్వర్, ఏఎంవీఐలు విజయ్‌కుమార్, ఫహీమా సుల్తానా, రంజిత్‌కుమార్, ప్రత్యూష, నిహారిక, శ్వేత, ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.


