సాహితీ వ‘కళాభరణం’...
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా సాహితి ఖిల్లాగా పేరుగాంచింది. తాజాగా జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి, రచయిత వకుళాభరణం రామ్ నరేశ్‌కుమార్ సాహితీ కళకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రశంస దక్కింది. భైంసాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్ నరేశ్ కుమార్ ‘వినరా భారతీయ వీరచరిత్ర.. పేరిట మరుగునపడిన భారత దేశ చారిత్రక వీరుల కథాంశాలను శతకపద్యరూపక పుస్తకంగా తీర్చిదిద్దారు. ఈ శతకాన్ని వందేమాతరం 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అందించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే మంచి పుస్తకాన్ని సాహితీ విపణిలోకి తెచ్చారని గవర్నర్ ప్రశంసించారు. మరుగున పడిన108 మంది వీరుల చరిత్రలతో పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. విదేశీ ముష్కరుల దాడులను ఎదుర్కొని దేశాన్ని కాపాడిన వీరుల చరిత్రలు నేటితరానికి చెప్పాలన్నారు.


