కొత్త ఆశలు.. ఆశయాలతో
కాలచక్రం గిర్రున తిరిగింది. మరో ఏడాది వచ్చేసింది. నూతన సంవత్సరంలో కొత్త ఆశలు.. ఆశయాలతో జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని అంటున్నారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్
పోలీస్ వ్యవస్థ పటిష్టతకు కృషి
2026 సంవత్సరంలో పోలీసు వ్యవస్థ మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తాం. యాంటీ డ్రగ్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మళ్లీ మళ్లీ నేరాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. రౌడీషీటర్లను కట్టడి చేస్తాం. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు పోలీసులను ఆశ్రయించాలి. మెస్సేజ్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలి. చెడు వ్యసనాల దూరంగా ఉండాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
– అఖిల్ మహాజన్, ఎస్పీ
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతాం. గతేడాది పాలనాపరంగా ఆదిలాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతృప్తి నిచ్చింది. అందరి సహకారంతో సాధించిన ప్రగతికి పురస్కారాలు, అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ ముందుకు సాగుతాం. మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రెవెన్యూ, భూభారతిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా శ్రద్ధ వహిస్తాం. అలాగే ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేర్చేలా ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్నిరంగాల్లో శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నా. – రాజర్షిషా, కలెక్టర్
కొత్త ఆశలు.. ఆశయాలతో
కొత్త ఆశలు.. ఆశయాలతో
కొత్త ఆశలు.. ఆశయాలతో


