‘బోథ్ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం..’
బోథ్: బోథ్ ప్రాంత అభివృద్ధి, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని పలువురు నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఫైర్‌స్టేషన్ సాధన కోసం సాగించిన పోరాటంలో భాగంగా బోథ్ ప్రాంత యువకులపై కేసులు నమోదయ్యా యి. ఈ మేరకు కోర్టుకు హాజరైన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బోథ్ ప్రయోజనాల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. గతంలో బోథ్ నుంచి తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, ఫైర్‌స్టేషన్, గ్రంథాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


