శాశ్వత పరిష్కారం చూపాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించా రు. జిల్లా నలుమూలల నుంచి 38 మంది అర్జీ దారులు వచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ ఆయా పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం అందిన ఫిర్యాదుల్లో ఫోర్జరీ, భూ సమస్యలు, అన్నదమ్ముల తగాదా లు వంటివి ఉన్నాయి. ఇందులో శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, జైస్వాల్ కవిత తదితరులున్నారు.
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈనెల 31న రాత్రి జిల్లా వ్యాప్తంగా 30 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించవద్దని, ర్యాలీలు, ఈవెంట్లు నిషేధమని పేర్కొన్నారు. ఫాంహౌస్‌లు, రిసార్టుల నిర్వాహకులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు, ట్రిపుల్‌రైడింగ్, రాంగ్‌రూట్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై కేక్‌లు, టపాసులు పేల్చడం, బైక్ రేసింగ్ చేయడం వంటివి చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
జిల్లాకు ట్రెయినీ ఐపీఎస్ అధికారి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకు నూతన శిక్షణఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్ సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలి శారు. జిల్లాలో ఐదు నెలల పాటు శిక్షణ పొందనున్నారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెంది న ఈయనది 2023 ఐపీఎస్ బ్యాచ్. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో శిక్షణ పొందా రు. పోలీసు శాఖలోని ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.


