డబ్బులు లే కున్నా.. క్యారెక్టర్ ఉన్నోడు
బోథ్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వద్ద డబ్బులు లేకున్నా.. అంతకన్న విలువైన క్యారెక్టర్ ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోథ్, సొనాలతో పాటు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలపరిచి గెలిచిన 134 మంది సర్పంచ్, ఉప సర్పంచ్‌లను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. నియోజకవర్గంలో అనిల్ నాయకత్వంలో పార్టీ బలంగా ఉందనడానికి మీ గెలుపే నిదర్శనమన్నారు. గెలిచిన ప్రతీ సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే అనిల్
ఇచ్చోడ/బోథ్: శాసనసభ సమావేశాల్లో భా గంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో సోమవారం నియోజకవర్గ సమస్యలపై తన గళం వినిపించారు. సోయా పంట విక్రయించేందుకు రైతుల పడుతున్న ఇబ్బందులను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


