విజ్ఞానయాత్రలొద్దు.. గూడు కావాలె
ఉట్నూర్‌రూరల్: ‘విజ్ఞానయాత్రలు వద్దు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముద్దు’ అంటూ కొలం గిరిజనులు సోమవారం ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీవీటీజీ జిల్లా అధ్యక్షుడు వసంత్‌రావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో గల అనేక గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయన్నారు. ఆదివాసీలకు గూడు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు మంజూరు చేస్తే ఆ నిర్మాణాలను ఫారెస్ట్ ఏరి యా అంటూ అటవీ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. అయితే ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కుమ్మరికుంటలో పర్యటించిన సమయంలో కొలం గిరిజనులను విజ్ఞానయాత్ర పేరిట హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పారని అన్నారు. అయితే తమకు యాత్రలు ముఖ్యం కాదని ఉండేందుకు గూడు కావాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకులు మానిక్‌రావు, కొడప అనసూయ, భీంరావు, నాగోరావు తదితరులున్నారు.


