
పెద్ద బాలశిక్షతో విద్యార్థులకు విజ్ఞానం
పలమనేరు: పెద్దబాలశిక్ష చదవడం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు తెలిపారు. స్థానిక కళామందిరంలో ఆదివారం పెద్దబాలశిక్ష పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలు కొంతసేపైనా పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని చదవాలన్నారు. ఇందులో అనేక విషయాలు వున్నాయని తెలపారు. ఈ పుస్తకాన్ని ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగానే అందజేస్తున్నామని తెలిపారు.
సదుం: స్థానిక ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు ఏటీఎం చాలా రోజులుగా సాంకేతిక సమస్యలతో మూతబడింది. దీంతో ఖాతాదారులతోపాటు అత్యవసర సమయాల్లో నగదు కోసం ఏమి చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ ఏటీఎంలో నగదు జమ చేసుకోవడంతో పాటు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉండేది. బ్యాంకుకు వరుస సెలవులు వున్నా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ఏటీఎం పనిచేయకపోవడంతో నగదు వేయడానికి, తీసుకోవడానికి బ్యాంకు తెరిచే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఏటీఎం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బైరెడ్డిపల్లె: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం మహతి ఫౌండేషన్ సహకారంతో కుప్పం పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరానికి విశేష స్పందన లబించింది. 267 మంది రోగులు వైద్య పరీక్షలు చేసుకున్నారు. వారికి కుప్పం పీఈఎస్ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అలాగే 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. అలాగే 20 మంది రక్తదానం చేశారు. మహతి ఫౌండేషన్ అధ్యక్షుడు నాగరాజు, వైద్యబృందం పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్: ప్రమాదకరంగా వాహనాలు నడిపిన 47 మందికి పోలీసులు జరిమానా విధించారు. చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర ఆదివారం తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అత్యంత వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తించారు. ఇలా 47 మందిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రూ.52 వేల జరిమానా వసూలు చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

పెద్ద బాలశిక్షతో విద్యార్థులకు విజ్ఞానం

పెద్ద బాలశిక్షతో విద్యార్థులకు విజ్ఞానం