
కూటమి ప్రభుత్వం ఆగడాలకు స్వస్తి పలకాలి
పుంగనూరు: ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు, వేధింపులు, అరెస్టులు తప్ప ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమి లేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆరోపించారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. ఆయన ఆదివారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎన్.పేట, వనమలదిన్నె రోడ్డులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. క్యూఆర్ కోడ్ పోస్టర్లను విడుదల చేశారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, సూపర్–6 హామీల అమలు, ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, వైఫల్యాలను వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, జయరామిరెడ్డి, రాజేష్, సురేష్, రాఘవ, ఎంఎం.ఆనంద, అస్లాంమురాధి, హేమంత్, శ్రీనివాసులు, మమ్ము, ఖాదర్, నయాజ్, అయాజ్, జావీద్ , సలామత్, కంచప్ప తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.