
గిరి గ్రామాల్లో పెర్సపేన్ పూజలు
ఇంద్రవెల్లి: వైశాఖమాసం పురస్కరించుకుని మండల పరిధిలోని గిరి గ్రామాల్లో ఆదివాసీలు మంగళవారం పెర్సపేన్ (పెద్ద దేవుడు) పూజలు ఘనంగా నిర్వహించారు. వడగామ్‌లో కోర్‌కార్ ఆత్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా వాయిద్యాలు వాయిస్తూ పెర్సపేన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కటోడ(పూజారి) ఇంట్లో సంప్రదాయ పూజలు చేశారు. ప్యాలాలు, పుట్నాలు, కానుకలు వేసి మొక్కులు సమర్పించారు. అనంతరం గ్రామ సమీపంలోని పవిత్రమైన మడుగులో స్నానం ఆచరించారు. రాత్రి మహాపూజ అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి కోర్‌కార్ ఆత్రం వంశీయులు తరలివచ్చారు.

గిరి గ్రామాల్లో పెర్సపేన్ పూజలు

గిరి గ్రామాల్లో పెర్సపేన్ పూజలు