లోవకు పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

లోవకు పోటెత్తిన భక్తులు

Aug 11 2024 11:56 PM | Updated on Aug 11 2024 11:56 PM

లోవకు పోటెత్తిన భక్తులు

లోవకు పోటెత్తిన భక్తులు

తుని: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణం మాసం తొలి ఆదివారం కావడంతో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. దేవస్థానానికి చెందిన కాటేజీలు నిండి పోవడంతో ప్రైవేటు కాటేజీలను భక్తులు ఆశ్రయించారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,57,100, పూజా టికెట్ల ద్వారా రూ.97,350, కేశఖండన ద్వారా రూ.7,160, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.4,400, కాటేజీల ద్వారా రూ.89,212, ఇతర విభాగాల నుంచి రూ.1,11,287 కలిసి రూ.4,67,509 ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు. భక్తులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సీఐ చెన్న కేశవరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement