రోడ్డెక్కిన చిరుద్యోగులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన చిరుద్యోగులు

Aug 10 2024 4:10 AM | Updated on Aug 10 2024 4:10 AM

రోడ్డెక్కిన చిరుద్యోగులు

రోడ్డెక్కిన చిరుద్యోగులు

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకునే అంగన్‌వాడీలపై సైతం కూటమి నాయకులు వేధిస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, డీఆర్‌డీఏ పరిధిలోని యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో పనిచేసేవారు, ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు కొత్త ప్రభుత్వంలో కూటమి నాయకుల నుంచి వివక్షకు గురవుతున్నారు. జిల్లాలో 1,637 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా మినీ కేంద్రాలు 89 మంది వరకు ఉన్నాయి. వీటిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిపి 3,274 మంది ఉండగా, మినీలో 89 మంది పనిచేస్తున్నారు. వీరిని సైతం కూటమి నాయకులు వదలడం లేదు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లలో పనిచేసే యానిమేటర్లకు సైతం రాజకీయ వేధింపులు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న సుమారు 1,500 మంది వరకు యానిమేటర్లను తొలగించాలని కూటమి పార్టీలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గం పరిధిలోనే 16 మంది వరకు యానిమేటర్లను తొలగించాలనే వత్తిడి ఉంది. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఆయా ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారంటే రెండు నెలల పాలన ఎంత అథమ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement