నయవంచన! | - | Sakshi
Sakshi News home page

నయవంచన!

Aug 10 2024 4:10 AM | Updated on Aug 10 2024 4:10 AM

నయవంచ

నయవంచన!

ఉద్యోగాల నుంచి

తొలగిస్తున్నారు

అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు, యానిమేటర్లను చాలా చోట్ల తొలగిస్తున్నారు. వర్కర్లకు ఆరు నెలలుగా జీతాలు లేవు. చంద్రబాబు, లోకేష్‌లు తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం లేదని చెబుతుంటే ఇక్కడ మాత్రం ఉద్యోగులను తొలిగిస్తామని భయపెడుతున్నారు.

– జె.కృష్ణవేణి, సీఐటీయూ

జిల్లా కోశాధికారి, మండపేట

సాక్షి అమలాపురం: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అన్నట్టు కాంట్రాక్ట్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే లక్ష్యంగా కూటమి నాయకులు చెలరేగిపోతున్నారు. చిరు ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. గత ఎన్నికలలో తమకు అనుకూలంగా పనిచేయలేదని కొందరు.. నాటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని మరికొందరిని తొలగించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే వలంటీర్లను తిరిగి విధులలోకి తీసుకోకుండా వారి భవిష్యత్‌ను గాలికి వదిలేసిన కూటమి నేతలు మరోవైపు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఉపాధి పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను వేధింపులకు గురి చేస్తున్నారు.

గాలిలో వలంటీర్ల భవితవ్యం

సంక్షేమ పథకాల అమలులోనే కాదు.. కరోనా.. గోదావరి వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యులకు సేవలందించిన వలంటీర్‌ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కరివేపాకులా తీసిపడేసింది. గతంలో ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలు సందర్భాల్లో విషం చిమ్మారు. అయితే ఎన్నికల సమయంలో వారిపై ఆవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.ఐదు వేల గౌరవ వేతాన్ని రూ.పది వేలకు పెంచుతామని, వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు వారిని తిరిగి విధులలోకి తీసుకోలేదు.

జిల్లాలో 9,581 మంది వరకు వలంటీర్లు ఉన్నారు. తెల్లవారు జామును ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంలో కీలకంగా వ్యవహరించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హాయాంలో కుల, మత, ప్రాంతాలనే తేడా లేకుండా వంద శాతం అర్హులకు పథకాలు అందించి అన్నివర్గాలకు అండగా నిలిచారు. అలాగే కారోనా విపత్కర పరిస్థితుల్లో రెండేళ్ల పాటు వారు అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఇంటింటా ఆరోగ్య సర్వే చేయడం, మందులు అందించడం, కరోనా బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడం వంటి సేవలందించారు. ఇక 2022 గోదావరికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలకు బాధితులు జేజేలు పలికారు. పీకల్లోతు వరద నీటిలో బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడం, ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ, బాధితులకు రూ.రెండు వేల నగదు పరిహారం అందించారు. ఏటిగట్ల కాపలా తదితర సేవలందించారు. ఇన్ని సేవలు చేసిన వలంటీర్‌ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాలిలో ఉంచడం ద్వారా ఎన్నికల హామీకు తాను కట్టుబడి ఉండనని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.

వలంటీర్లను తొలగించాలని

అధికారులపై ఒత్తిడి

జిల్లాలో 9,500 మంది పరిస్థితి

ప్రశ్నార్థకం

రూ.పది వేలిస్తామని వాగ్దానం చేసి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న వైనం

కూటమి కీలక నేతల ఒత్తిడి తాళలేక

కలెక్టరేట్‌ వద్ద వలంటీర్ల ఆందోళన

అంగన్‌వాడీ, యానిమేటర్లదీ అదే పరిస్థితి

నయవంచన!1
1/1

నయవంచన!

Advertisement
 
Advertisement
Advertisement