breaking news
Wave intensity
-
డేంజర్ బెల్స్.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్‌నినో సిగ్నల్!
భూమిపై అతిపెద్ద మహాసముద్రం.. దాని లోతుల్లో వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక భారీ వేడి నీటి ప్రవాహం.. అదే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. ఏకంగా 14,500 కిలోమీటర్ల పొడవున్న ‘కెల్విన్ వేవ్ (Kelvin Wave)’ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు దిశగా కదులుతోంది. ఈ ఒక్క పరిణామం ప్రపంచ వాతావరణాన్ని నెలల తరబడి ప్రభావితం చేసే ఎల్‌నినో (El Nino) తిరిగి బలపడుతున్న సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అమెరికా వాతావరణ సంస్థ NOAA ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఈ భారీ వేడి నీటి అలను నాసా–యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న Sentinel-6 Michael Freilich ఉపగ్రహం అత్యంత స్పష్టంగా నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మాన్స్టర్ వేవ్.. కానీ సునామీ కాదు!సముద్రంలో 14,500 కిలోమీటర్ల అల అని వినగానే భయంకరమైన కెరటం కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఇది అలాంటి అల కాదు. ఇది సముద్రం లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. దీన్ని శాస్త్రవేత్తలు కెల్విన్ వేవ్ అంటారు. ఇది సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా కదులుతూ, ఉపరితలంలోని నీటిని కూడా వేడెక్కిస్తుంది. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్‌కు చేరుకున్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.🌊 A 14,500-km “monster wave” of warm water is moving across the Pacific.Tracked from space by NASA’s Sentinel-6 satellite, the massive Kelvin wave is pushing heat eastward — a major signal of a strengthening El Niño. pic.twitter.com/SkZ0ebXIs0— StarSnap 🌟 (@StarSnap_1) July 4, 2026ఎందకంత ప్రమాదకరం?సాధారణంగా పసిఫిక్‌లో తూర్పు నుంచి పడమర వైపు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. అయితే ఆ గాలులు బలహీనపడితే, ఆ వేడి నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగినట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ఇది చిన్న మార్పుగా కనిపించినా, ప్రపంచ వాతావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద సంకేతం.ప్రపంచానికి ఎందుకు టెన్షన్?ఎల్‌నినో అనేది ఒక దేశానికి లేదా ఒక సముద్రానికి మాత్రమే సంబంధించిన పరిణామం కాదు. ఇది భూమి మొత్తం వాతావరణ సమతుల్యాన్ని మార్చగల శక్తి. దీని కారణంగా ఒక దేశంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. మరో దేశంలో తీవ్ర కరువు.. ఎక్కడో అడవి మంటలు.. మరెక్కడో శక్తివంతమైన తుఫాన్లు వస్తాయి. అలాగే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు అవతాయి. ఇవన్నీ ఎల్‌నినోతో ముడిపడి ఉండే అవకాశాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని అత్యంత నిశితంగా గమనిస్తుంటారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్‌నినో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రుతుపవనాలు. ఎల్‌నినో బలంగా ఉంటే సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గవచ్చు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి నుంచి తాగునీటి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈసారి మరో అంశం కొత్త ఆశను కలిగిస్తోంది. అదే భారత మహాసముద్ర డైపోల్ (IOD). ఇది అనుకూలంగా ఉంటే ఎల్‌నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.‘సూపర్ ఎల్‌నినో’ వస్తుందా?శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. NOAA అంచనాల ప్రకారం, ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం 63 శాతం వరకు ఉంది. అది జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ ఘటనలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.🚨 A 14,500-km "monster wave" is crossing the Pacific as El Niño strengthensNASA's Sentinel-6 satellite detected a vast subsurface warm-water (Kelvin) wave stretching nearly 14,500 km across the tropical PacificThe heat pulse raised sea-surface height by up to 15 cm#SSTVI pic.twitter.com/2QKrSoVcEh— Geo Politics Desk (@GeoPoliticsDesk) July 4, 2026 -
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరం భిన్నమైన మార్పులను సంతరించుకుంటున్నది. గురువారం బీచ్‌లో సుమారు 200 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం, అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి సమారు కిలోమీటరు మేర లోపలికి వెళ్లింది. బీచ్‌లో అలల తీవ్రతతో సంద్రం ఉగ్రరూపంతోనూ, గోదావరి, సముద్రం కలిసే అన్నాచెల్లెలు గట్టు వద్ద సంద్రం తక్కువ అలల తీవ్రతతో ప్రశాంతంగా ఉంది. అన్నాచెల్లెలు గట్టు ప్రాంతంలో సముద్రం ఎంత ముందుకు వస్తుందో అంత వెనక్కి వెళ్లిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కనుచూపు మేర ఇక్కడ తీరం ఖాళీగా ఆటస్థలంగా కనిపిస్తున్నది. అమావాస్య, పౌర్ణమి ప్రభావాలతో ఆటు పోటులకు బీచ్ వద్ద ఒకలా, అన్నాచెల్లెలు గట్టు వద్ద మరొకలా ఎగసి పడుతున్న కెరటాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం వల్ల సముద్ర గర్భంలో వచ్చిన అలజడి ప్రభావమే ఇందుకు కారణమై ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బీచ్‌లో పరిస్థితులను తహసీల్దారు వై.రామకుమారి, మెరైన్ సీఐ బొక్కా పెద్దిరాజు, ఎస్ఐలు రవివర్మ, సోమశేఖర్‌రెడ్డి, సిబ్బంది బీచ్‌లో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి కిలోమీటరు లోపలికి వెళ్లిన సముద్రం ప్రమాదం ఏమీలేదు అంతర్వేది వద్ద సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ముంబై, గుజరాత్, గోవా వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అంతర్వేది విషయానికి వచ్చేసరికి సముద్రపు భూభాగం సమాంతరంగా (ఫ్లాట్‌గా) ఉండడమే కారణం. సగటున కేవలం 4 అడుగుల ఎత్తులో భూభాగం ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. – మురళీకృష్ణ, ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్, డైరెక్టర్, జేఎన్టీయూ కాకినాడ -
అల్పపీడనంతో విశాఖలో పెరిగిన అలల ఉధృతి
-
శాంతించిన సముద్రం
తగ్గిన అలల ఉధృతి వెయ్యి లారీల బండరాళ్ల లోడ్లు డంపింగ్ లారీ బోల్తా : డ్రైవర్ క్షేమం విశాఖపట్నం సిటీ: సముద్రం శనివారం శాంతించింది. అలల ఉధృతి కాస్త తగ్గింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరితీసుకుంది. మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగసి పడడంతో బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైన విషయం తెలిసిందే. కోతకు గురైన ప్రాంతాన్ని జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి 13 వేల క్యూబిక్ మీటర్ల మేర బండరాళ్లను వేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు మాత్రమే రాళ్లను నింపినట్టు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తీరాన్ని రాళ్లతో నింపాల్సిందిగా సూచించారు. లారీ బోల్తా: బీచ్ రోడ్డు నుంచి తీరంలోకి బండరాళ్లను డంప్ చేస్తున్న ఓ లారీ బోల్తా పడింది. శనివారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పుతోందని గ్రహించిన డ్రైవర్ వెంటనే కిటికిలోంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు భారీ క్రేన్ల సాయంతో 30 అడుగుల లోతులో ఉన్న లారీని బయటకు తీశారు.


