breaking news
urgent hearing pil
-
గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగకు కేవలం రెండు రోజుల ముందు ఈ అభ్యర్థన రావడంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో పిటిషన్ ఎందుకు?అఖిల భారత హిందూ మహాసభ మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ అగర్వాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గోవధను నిషేధించే చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే వధశాలల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. బుధవారమే ఈ అంశంపై విచారణ చేపట్టాలని న్యాయవాది బారున్ కుమార్ సిన్హా కోర్టును కోరారు.సుప్రీంకోర్టు ఘాటు స్పందనఈ అభ్యర్థనను విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘పండుగకు ఒక్కరోజు ముందు మీకు ఇది గుర్తుకొచ్చిందా? ఇందులో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానిస్తూ, విచారణను చేపట్టేందుకు స్పష్టంగా నిరాకరించింది. సమయానుకూలంగా కాకుండా, పండుగ వేళ ఇలాంటి అంశాలను కోర్టు ముందుకు తేవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.న్యాయపరమైన పరిణామాలుప్రస్తుతానికి ఈ పిటిషన్‌పై ఎలాంటి అత్యవసర ఉత్తర్వులు జారీ కాకపోవడంతో, పాత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే పండుగ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. చట్టాల అమలు, వధశాలల నియంత్రణకు సంబంధించి పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తదుపరి సాధారణ విచారణలో పరిశీలించాల్సి ఉంటుంది. అత్యవసర విచారణ కోరిన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో, ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. -
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్‌ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్వీలర్కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. -
మీటూ పిటిషన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
-
బడ్జెట్ ఆపే పిల్‌పై అర్జెంట్ లేదన్న సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌ను ఎన్నికల నేపథ్యంలో ఆపించే ఉద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర వాదనల కిందట విచారించేందుకు సుప్రీంకోర్టు కోర్టు నిరాకించింది. పిటిషన్ విచారించే సమయం వచ్చినప్పుడే విచారిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 4 ప్రారంభం కానుంది. ఈలోగా కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా ఆపేయాలని కావాలంటే మార్చి 15 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. అయితే దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ ఈ పిటిషన్లో తనకు అత్యవసరం ఏమీ కనిపించడం లేదని, దీనిపై విచారణ సమయం వచ్చినప్పుడు విచారిస్తామంటూ న్యాయవాదికి తెలిపారు.


