breaking news
Upper Caste Attack
-
బీసీలపై అగ్రవర్ణం దాడులు
ఇంకొల్లు (చినగంజాం): దేవుని ఊరేగింపు విషయంలో తలెత్తిన వివాదం రెండువర్గాల మధ్య విద్వేషాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీల ఇళ్లపై ఒక అగ్రవర్ణం దాడులకు దిగింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్లలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నాగండ్ల గ్రామంలో ఏటా సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో మాధవయ్యస్వామి ఊరేగింపును బీసీలు, కనుమ రోజున అగ్రవర్ణం నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున ఎప్పటిలా బీసీలు ఊరేగింపు నిర్వహిస్తుండగా అగ్రవర్ణం వారితో చిన్నపాటి ఘర్షణ జరిగింది. కనుమ రోజున అగ్రవర్ణం ఊరేగింపు నిర్వహించేందుకు సిద్ధంకాగా.. ఊరేగింపు వాహనం వెళ్లే మార్గంలో బీసీలు బైక్ స్లో రేసింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.దీంతో రెండువర్గాల మధ్య మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో పోలీసులు రెండువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే, ఈ నెల 17వ తేదీన అగ్రవర్ణానికి చెందిన కొందరు బీసీ మహిళతో ఘర్షణకు దిగడంతో ఆమె బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు సామూహికంగా బీసీల ఇళ్లపై దాడికి దిగారు. కర్రలు, ఇసుపరాడ్లతో దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. దాడిలో కయ్యాల సింగయ్యకు తల పగలగా, కయ్యాల శ్రావణి, కయ్యాల కోటేశ్వరమ్మ, తిరుపతమ్మ, కయ్యాల రమణ, నాగరాజు, సర్పంచ్ పద్మ భర్త కంచుగంటి వెంకటేశ్వర్లుపై టీడీపీకి చెందిన వారు విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు వాపోయారు.తమపై పథకం ప్రకారమే దాడిపర్తి వాసు, పవన్, యర్రమాసు హరిబాబు, ఈదర వెంకటేశ్వర్లు, ఉమ, రామారావు, ఈదర వెంకటేశ్వర్లు, పేర్ని నవీన్, రవీంద్ర, రమేష్, కె.పవన్, అనిల్, సుజాత, అశోక్ తదితరులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. గాయాలపాలైన సింగయ్య తదితరులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడిలో గాయపడిన కయ్యాల సింగయ్య ఫిర్యాదు మేరకు 8 మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు ఎన్ఐ సురేష్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తమతో కూర్చొని భోజనం చేశాడని చంపేశారు!
డెహ్రాడూన్: ఆధునికంగా మనిషి ఎంత ఎదుగుతున్నా.. ఇంకా కులం పేరుతో జరిగే హత్యలు ఆగడం లేదు. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. మరోవైపు రోజురోజుకు దళిత, గిరిజనులపై అగ్రకులంవారి దాష్టికం తగ్గడంలేదు. తాజాగా ఓ దళిత వ్యక్తిని ఆగ్రకులానికి చెందిన కొందరు దాడి చేసి చంపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన వివాహవేడుకలో రమేశ్‌రామ్ అనే దళిత వ్యక్తి తమతో పాటు కూర్చొని భోజనం చేశాడని అగ్రకులానికి చెందినవారు అతనిపై దాడికి దిగారు. చదవండి: Bigg Boss Kirik Keerthi: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై బీర్ బాటిల్‌తో దాడి తమకు దూరంగా ఉండి భోజనం చేయాలన్న నియయాన్ని అతడు ఉల్లంఘించాడని చావబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్‌రామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్రకులానికి చెందిన కొంతమంది వివాహం వేడుకలో తన భర్తపై తీవ్రంగా దాడిచేశారు. వారి దాడి కారణంగానే తన భర్త మృతి చెందడని రమేశ్‌రామ్ భార్య తులసిదేవి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
ఆ అమ్మాయితో మాట్లాడినందుకు గుండు గీయించి..
జైపూర్: దేశంలో కులవివక్ష ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇది. ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొందరు మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వాన్ని మరచి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు అగ్రకులాల అమ్మాయితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అతడికి గుండు కొట్టించారు. మెకానిక్ షాప్‌లో పనిచేసే రాహుల్ మేఘావాల్ అనే యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. వీరిద్దరు ఓ కాఫీ హోటల్లో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్ ఇంటిపై దాడి చేశారు. అంతేగాక ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై విచక్షణ మరిచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం -
చెప్పిన పని చేయలేదని ముక్కు కోశారు
భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఓ దళిత కుటుంబంపై కుల వివక్ష దాడి జరిగింది. తాము చెప్పిన పని చేయలేదని అగ్రవర్ణానికి చెందిన ఓ కుటుంబం ఆమెపై దాడి చేసి ముక్కును కోసేశారు. రజ గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానకీ భాయ్(35) అనే మహిళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. తమ ఇంట్లో పనిలోకి రాలేదన్న కారణంతో ఓ కుటుంబం దాడికి తెగబడింది. "వారంతా నా భార్యపై దాడికి తెగబడ్డారు. అందులో ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో ఆమె ముక్కును నరికేశారు. అడ్డుకోవటానికి వెళ్లిన నాపైనా దాడి చేశారని" ఆమె భర్త రాఘవేంద్ర చెబుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.


