ఆ అమ్మాయితో మాట్లాడినందుకు గుండు గీయించి..

Dalits Head Shaved For Meeting Upper Caste Girl At Jodhpur Cafe - Sakshi

జైపూర్‌: దేశంలో కులవివక్ష ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇది. ఎన్ని చట్టాలు, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కొందరు మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వాన్ని మరచి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు అగ్రకులాల అమ్మాయితో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అతడికి గుండు కొట్టించారు.

మెకానిక్‌ షాప్‌లో పనిచేసే రాహుల్‌ మేఘావాల్‌ అనే యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. వీరిద్దరు ఓ కాఫీ హోటల్లో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు రాహుల్‌ ఇంటిపై దాడి చేశారు. అంతేగాక ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై విచక్షణ మరిచి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

చదవండి: ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top