UK Home Office
-
వీసా ఆంక్షలతో వెనక్కి తగ్గిన ఆఫ్రికా దేశాలు
లండన్: వీసాలను నిలిపివేస్తామంటూ యూకే హోం శాఖ చేసిన బెదిరింపులతో ఆఫ్రికాలోని మూడు దేశాలు వెనక్కి తగ్గాయి. యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన, ఇతర నేరాలకు పాల్పడిన వారిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ దేశాలు సమ్మతిని తెలిపాయి. ఈ విషయాన్ని యూకే హోం శాఖ శుక్రవారం తెలిపారు. నమీబియా, అంగోలాలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. పౌరులకు కోసం ఫాస్ట్‌ట్రాక్ వీసా ప్రాసెసింగ్ విధానాన్ని రద్దు చేయడంతోపాటు ఆ దేశం నుంచి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక వీసా సౌకర్యాలను రద్దు చేస్తామంటూ హెచ్చరించడంతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ) తాజా తమ దారికి వచ్చిందని హోం మంత్రి షబానా మహ్మూద్ చెప్పారు. విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన పక్షంలో తగు పర్యావసానాలను ఎదుర్కొనక తప్పదన్నారు. అక్రమ వలసదారులు, ప్రమాదకరమైన నేరగాళ్లను పట్టుకుని, అంగోలా, నమీబియా, డీఆర్సీలకు పంపించివేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, సొమాలియా, గబోన్ వంటి దేశాలు ఈ రకమైన ఒప్పందానికి వ్యతిరేకత చూపుతున్నందున, వాటిపైనా వీసా సంబంధిత ఆంక్షలు విధిస్తారంటూ వస్తున్న వార్తలపై ఆమె నేరుగా స్పందించలేదు. యూకేలో 2025 జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 58 వేల మంది అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించి వేసింది. తాజాగా, మూడు ఆఫ్రికా దేశాలతో కుదిరిన ఒప్పందం ఫలితంగా మరో 3 వేల మందిని ఆయా దేశాలకు తిప్పిపంపే అవకాశాలున్నాయి. -
యూకే వీసాల్లో సింహభాగం భారతీయులదే
లండన్ : నిపుణులైన విదేశీయులకు తామిచ్చే వీసాల్లో 57 శాతం భారతీయులకే లభించాయని యూకే హోంశాఖ వెల్లడించింది. 2016లో 53,575 మంది నైపుణ్యం గల భారతీయ కార్మికులకు వర్కింగ్ వీసాలు మంజూరైనట్లు తెలిపింది. ఈ జాబితాలో 9,348 వీసాలతో అమెరికా రెండోస్థానంలో నిలిచింది. గతేడాదిలో మొత్తం 93,244 వీసాలు మంజూరు చేయగా అందులో భారతీయులకే 53,575 వీసాలు లభించాయి. 2016లో 11,330 మంది భారతీయులకు విద్యార్థి వీసా మంజూరైనట్లు తెలిపింది. -
నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం
లండన్: వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల భారీ సంఖ్యలో భారత ఐటీ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. యూకే హోం శాఖ గత నెలలో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం... నవంబర్ 24న లేదా ఆ తర్వాత టైర్ 2 అంతర కంపెనీ బదిలీ(ఐసీటీ) కోసం చేసుకునే దరఖాస్తులకు కనీస వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇంతకు పూర్వం ఇది 20 వేల 800 పౌండ్లు. ఐసీటీ విధానం కింద జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకున్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ తెలిపింది. వీసా విధానంలో చేసిన మార్పులు మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమించనున్నాయి. వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు.


