breaking news
trimurthulu
-
బాలి దీవిలో ఘనంగా గాలిపటాల వేడుక..
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో బాలి దీవికి చేరుకుంటారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఏటా జరిగే ‘బాలి కైట్ ఫెస్టివల్’ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.కైట్స్ ఫెస్టివల్ బాలి అంతటా వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే, ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం సనుర్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పడంగ్గలక్ బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ వేడుకలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు మస్కెటి బీచ్, మెర్తాసరి బీచ్, కుటా, ఉబుద్, దెన్ పసార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ప్రతిచోటా వినిపించే బాలి సాంప్రదాయ సంగీతమైన ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, ఈ గాలిపటాల పండుగ కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. పంటలు సమృద్ధిగా పండినందుకుగాను దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశీస్సులు కోరుతూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ‘బంజర్’ అని పిలిచే స్థానిక యువజన సంఘాలు, వారి ‘సెకా లాయంగన్’ అంటే గాలిపటాల బృందాలతో కలిసి ఈ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి కోసం తలపడతాయి. ప్రతి బృందంలో 70 నుంచి 80 మంది సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి గాలిపటాలను సిద్ధం చేయడం, వాటిని గాల్లోకి ఎగరేయడం ఒక అద్భుతమైన టీమ్‌వర్క్. ఈ పోటీలలో అత్యంత సృజనాత్మకమైన, వినూత్నమైన గాలిపటానికి ‘న్యూ క్రియేషన్’ అవార్డుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా అందజేస్తారు. త్రీ–డైమెన్షనల్ రూపాలు, వివిధ రకాల మస్కట్ల ఆకృతులలోని గాలిపటాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.త్రిమూర్తుల సంకేతం..ఈ ఉత్సవాల్లో మూడు రకాల గాలిపటాలను తయారుచేస్తారు. జాంఘన్ అనే గాలిపటం పక్షి ఆకారంలో ఉంటూ, దాదాపు 100 మీటర్ల కంటే పొడవైన తోకను కలిగి ఉంటుంది. రెండవది బెబీయన్ అని పలిచే గాలిపటం. ఇది చేప ఆకారంలో ఉండి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఇక మూడోది పెకుకాన్ గాలి పటాలు. ఇవి ఆకు ఆకారంలో ఉండి గాలిలో స్థిరంగా ఉండవు. అందువల్ల దీన్ని గాలిలో ఎగురవేయడానికి 10 మందికి పైగా నిపుణులైన ఫ్లైయర్స్ అవసరమవుతారు.అంతేకాకుండా ఈ సాంప్రదాయ గాలిపటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు హిందూ త్రిమూర్తులను సూచిస్తాయి. ఎరుపు రంగు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని, తెలుపు రంగు రక్షకుడైన విష్ణుమూర్తిని, నలుపు రంగు లయకారుడైన శివుడిని సూచిస్తాయి. అలాగే అష్టదిక్పాలకులను గౌరవిస్తూ పసుపు రంగును కూడా జోడిస్తారు. -
దమ్ముంటే నాపై పోటీచేయి నానాజీ.. MLC త్రిమూర్తులు సవాల్
సాక్షి, కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. తను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు. పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీచేయాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను గనుక ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. -
వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్ (ఫోటోలు)
-
తోట త్రిమూర్తులను పరామర్శించిన పేర్ని నాని
-
సూపర్ సిక్స్ ని నమ్మి ఓటేశారు.. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది
-
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ
-
బహు సుందర బ్రహ్మ ఆలయం
సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: ఆయన సృష్టికర్త. త్రిమూర్తులలో ప్రథమ స్థానం. అయినా బ్రహ్మదేవుడికి పూజలు చేయడం అరుదు. ఆలయాలూ ఉండవు. భృగు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఉండవని, పూజలు జరగవని పురాణాల ప్రకారం చెబుతారు. అయితే కాశీ, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గర్లోని పుష్కర్‌లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక మూడోది మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉంది. ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రదేశం. కోనేరు మధ్యలో ఆలయం ► చేబ్రోలులో బ్రహ్మ ఆలయాన్ని 1817లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించారు. ► పెద్ద కోనేరును తవ్వించి, దాని ఆలయాన్ని నిర్మించి, బ్రహ్మదేవుడిని ప్రతిష్టించారు. ► పద్మాకారంలో ఉండే పానపట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ 4 ముఖాలనూ రూపొందించారు. గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం మరో విశేషం. భక్తులు ఎటునుంచైనా స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలూ నిత్యకృత్యం. బ్రహ్మ దేవుడి ఆలయం చుట్టూ మరెన్నో దేవాలయలున్నాయి. పాపపరిహారం కోసం.. రాజ్యంలో మితిమీరిన దొంగతనాల కట్టడికి, పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయం నిర్మించాలని తలుస్తారు. పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే, ఆ దేవతా మూర్తి దృష్టి పడ్డంతవరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కులనుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయ నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మనసు శాంతించిందని చెబుతారు. ఈ ఆలయ ఉత్సవ, దీపారాధన, నైవేద్యాది కైంకర్యాలకు, దేవదాసీలు, భజంత్రీలు, అర్చకులు వగైరాలకు మాన్యాలను ఆయన సమకూర్చారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం చేబ్రోలులోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఏకైక బ్రహ్మ ఆలయంగా ప్రసిద్ధి. ఆలయ కట్టడాలు, శివలింగం.. అన్నీ కాకతీయ వాస్తుశైలిని పోలి ఉన్నాయి. నాలుగు వైపుల్నుంచి స్వామిని దర్శించుకొనేలా నిర్మించిన అరుదైన సార్వతోభద్ర ఆలయం ఇది. ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది దిక్పాలకులకు దేవాలయాలుండటం మరో ప్రత్యేకత. సృష్టికర్తయిన బ్రహ్మ పేరిట ఆలయాన్ని నిర్మించి, దిక్పాలకుల పర్యవేక్షణలో సత్యలోకాధిపతిని సందర్శించుకోవటం అన్ని పాపాలకు పరిహారమని నాటి జమీందారు నమ్మారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్నుంచి కూడా యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్రముఖ స్థపతి -
మహిళల అక్రమ రవాణ కేసులో పురోగతి
నరసాపురం (పశ్చిమగోదావరి) : వ్యభిచారం చేయించేందుకు విజిట్ వీసాతో ఐదుగురు మహిళలను దుబాయి పంపిన ఏజెంట్లను నరసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళల అక్రమ రవాణా కేసులో నరసాపురం పోలీసులు శుక్రవారం రాత్రి త్రిమూర్తులు, తిమూతి అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్లు ఐదుగురు మహిళలను విజిట్ వీసాపై దుబాయి పంపి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ హోం మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేయాలని ఎస్పీకి హో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళలు అమలాపురం,నరసాపురానికి చెందినవారిగా భావిస్తున్నారు. వారిని దుబాయ్ నుంచి ఇక్కడికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. -
రుణమాఫీ లోగుట్టు బట్టబయలు
-
రుణమాఫీ లోగుట్టు బట్టబయలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అమలు చేసిన రుణమాఫీ పథకంలోని లోగుట్టు బట్టబయలైంది. మంగళవారం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీడీపీ నేతలే రుణమాఫీ అమలులోని లోపాలను ఎత్తిచూపారు. ఎకరం భూమి ఉండి 24 వేల రూపాయల అప్పు ఉన్న రైతుకు నాలుగు వేలు మాత్రమే ఎకౌంట్లో వేశారని టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. 50 వేల లోపు రుణం వారికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశారని సీఎంకు స్పష్టం చేశారు. ద్రాక్షారామం సొసైటీలో చాలామంది రైతులకు అన్యాయం జరిగిందని త్రిమూర్తులు చెప్పారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో గరిష్టంగా ఒక్కో రైతు కుటుంబానికి 1.5 లక్షల వరకు మాఫీ చేస్తూ తొలివిడతలో 20 శాతం వారి అకౌంట్లో జమ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక 50 వేల లోపు రుణం ఉన్నవారికి ఒకేసారి మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆన్లైన్ ఉంచిన రుణమాఫీ జాబితాలో అనేక లోపాలున్నాయని, చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.


