taxed
-
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు
-
విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు
శ్రీనగర్: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను ను జూలై 1 నుంచి అమలు చేయాలని కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో పన్ను విధానంపై ఈ నెల 18, 19న జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 19నాటి సమావేశంలో సర్వీసెస్ పన్నురేట్లపై ఒప్పందం కుదిరిందన్నారు. అయితే తదుపరి జీఎస్టీ15వ సమావేశం ఢిల్లీలో జూన్ 3న నిర్వహిస్తాంమని జైట్లీ ప్రకటించారు. . శుక్రవారం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం రెండవ రోజున, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ విద్య, వైద్య సేవలను పన్ను మినహాయింపు ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తమకు లాండ్ మార్క్ లాంటిదన్నారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ ప్రకటించారు. విస్తృతంగా సేవలకు నాలుగు పన్నుల విధానానికి కౌన్సిల్ అంగీకరించిందనీ, ఎక్కువ శాతం 18 శాతం పన్ను విధించనున్నమని చెప్పారు. ఈ పన్ను వర్గీకరణలు సేవ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. మిగిలిన సర్వీసెస్ రేట్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ సర్వీసులపై 5 శాతం పన్ను, ఎసీ బార్ అండ్ రెస్టారెంట్లు 18శాతం, ఫైప్ స్టార్ , హోటెల్, రేస్కోర్స్ , గాంబ్లింగ్, సినిమాపై 28 శాతం పన్నును నిర్ణయించారు. 6 కేటగిరీలపై ఇంకా నిర్ణయించాల్సి ఉంది. దీనిపై మరింత కౌన్సిల్ పై మరింత చర్చ జరగాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్వీసులు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసులపై 18 శాతంగా నిర్ణయించారు. అలాగే తదుపరి సమావేశంలో బంగారంపై జీఎస్టీని నిర్ణయించనున్నామని చెప్పారు.


