breaking news
tamilnadu political senario
-
తమిళనాట మారుతున్న రాజకీయం
-
తమిళనాట మారుతున్న రాజకీయం
తమిళనాడులో రాజకీయం పలు రకాలుగా మారుతోంది. మరికొద్ది సేపట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఆమె వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం గూటికి చేరుకున్నారు. షెమ్మలయ్ అనే ఎమ్మెల్యే కూడా శశికళకు గుడ్‌బై చెప్పి పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. మరోవైపు సోమవారం ఒక ఎమ్మెల్యే గోడ దూకి.. మారువేషంలో బయటపడి మరీ శశి క్యాంపు నుంచి పన్నీర్ గూటికి చేరిన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలతో ఇరు వర్గాలూ అందోళనగా కనిపిస్తున్నాయి. ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటని పన్నీర్ వర్గం, దోషిగా తేలితే ఏం చేయాలని ప్రత్యామ్నాయాలకు సంబంధించిన ఆలోచనలతో శశికళ వర్గం తల మునకలుగా ఉన్నాయి. రాత్రి నుంచి శశికళ రిసార్టులోనే ఉండిపోయారు. ఆమెకు గట్టి మద్దతుదారుగా ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయాన్నే రిసార్టుకు వెళ్లి, శశికళతో మాట్లాడి, కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చేశారు. తీర్పు నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్టు వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ