breaking news
swamy chidatmananda
-
రేప్ కేసులో చిన్మయానంద అరెస్ట్
షహజాన్‌పూర్: న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన అభియోగంపై కేంద్ర మాజీ మంత్రి స్వామీ చిన్మయానంద (72) అరెస్టయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిందని పోలీసులు వెల్లడించారు. తన ప్రవర్తన పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ‘ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఇందులో జాప్యమేమీ లేదు. బాధితురాలు కేసు నమోదు చేయించే సమయంలో, ఆమె వద్ద ఉన్న వీడియో ఆధారాలను ఇచ్చింది. అవి నిజమైనవని నిర్థారించుకున్నాకే, ఆయన్ను అరెస్ట్ చేశాం’ అని డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. సిట్ అధికారి నవీన్ ఆరోరా మాట్లాడుతూ.. బాధితురాలు, నిందితుల కాల్ డేటాను పరిశీలించామని తెలిపారు. బాధితురాలు ఓ పెన్‌డ్రైవ్‌లో 43 వీడియోలను సిట్‌కు సమర్పించింది. చిన్మయానందకు చెందిన ఓ సంస్థలో న్యాయ విద్య అభ్యసిస్తుండగా పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. -
డల్లాస్‌లో ముగిసిన అటా స్పిరుచ్యువల్ డేస్
డల్లాస్: అమెరికాలోని 20 నగరాల్లో అమెరికా తెలుగు సంఘం(అటా) స్పిరుచ్యువల్ డేస్‌ను నిర్వహించింది. చివరగా డల్లాస్‌లో కార్యక్రమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉభయ తెలుగురాష్ట్రాల్లో చిన్మయి మిషన్ హెడ్ స్వామి చిదాత్మానంద అమెరికాలో పర్యటించారు. అటా మాజీ అధ్యక్షురాలు, సీనియర్ మెంబర్ ఆఫ్ అటా అడ్వైజరీ కమిటీ సంధ్యా గవ్వా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. స్పిరుచ్యువల్ డే కార్యక్రమాన్ని స్వామి చిదాత్మానంద ప్రారంభించి, ప్రసంగించారు. ఓం మంత్రాన్ని జపిస్తూ మెడిటేషన్ చేయడం గురించి ఆయన వివరించారు. పలు రకాల ఆటలను కార్యక్రమానికి హాజరైన వారికి వివరించిన స్వామి.. వాటి నుంచి శక్తిమంతమైన మెసేజ్‌లను ఇచ్చారు. అటా డల్లాస్ రీజినల్ కో-ఆర్డినేటర్స్ రామ్ అన్నాడి, అశోక్ కొండాల, ప్రసన్న డొంగూర్, మహేందర్ ఘనాపురం, రాజ్ ఆకుల, సతీష్ రెడ్డి, అనంత్ పజ్జూర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అరవింద్ రెడ్డి ముప్పిడి, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, మాధవి లోకిరెడ్డి, చంద్ర పోలీస్, అశోక్ పొద్దుటూరి, అశ్విన్ చక్రవర్తి, ఫణీందర్ రెడ్డి, వెంకట్ ముసుకు, దామోదర్ ఆకుల, సుమన బాసని, నీల్‌లోహిత్ కోత్, లోకల్ కమ్యూనిటీ వాలంటీర్లు మధుమతి వైశ్యరాజు, వెంకటరమణ లష్కర్లు కార్యక్రమం విజవంతం కావడానికి కృషి చేశారు.