డల్లాస్‌లో ముగిసిన అటా స్పిరుచ్యువల్‌ డేస్‌ | ATA spirituality day concludes in dallas on gurupoornima day | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ముగిసిన అటా స్పిరుచ్యువల్‌ డేస్‌

Jul 18 2017 12:37 PM | Updated on Nov 9 2018 6:23 PM

అమెరికాలోని 20 నగరాల్లో అమెరికా తెలుగు సంఘం(అటా) స్పిరుచ్యువల్‌ డేస్‌ను నిర్వహించింది.



డల్లాస్‌:
అమెరికాలోని 20 నగరాల్లో అమెరికా తెలుగు సంఘం(అటా) స్పిరుచ్యువల్‌ డేస్‌ను నిర్వహించింది. చివరగా డల్లాస్‌లో కార్యక్రమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉభయ తెలుగురాష్ట్రాల్లో చిన్మయి మిషన్‌ హెడ్‌ స్వామి చిదాత్మానంద అమెరికాలో పర్యటించారు.

అటా మాజీ అధ్యక్షురాలు, సీనియర్‌ మెంబర్‌ ఆఫ్‌ అటా అడ్వైజరీ కమిటీ సంధ్యా గవ్వా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. స్పిరుచ్యువల్‌ డే కార్యక్రమాన్ని స్వామి చిదాత్మానంద ప్రారంభించి, ప్రసంగించారు.

ఓం మంత్రాన్ని జపిస్తూ మెడిటేషన్‌ చేయడం గురించి ఆయన వివరించారు. పలు రకాల ఆటలను కార్యక్రమానికి హాజరైన వారికి వివరించిన స్వామి.. వాటి నుంచి శక్తిమంతమైన మెసేజ్‌లను ఇచ్చారు.

అటా డల్లాస్‌ రీజినల్‌ కో-ఆర్డినేటర్స్‌ రామ్‌ అన్నాడి, అశోక్‌ కొండాల, ప్రసన్న డొంగూర్‌, మహేందర్‌ ఘనాపురం, రాజ్‌ ఆకుల, సతీష్‌ రెడ్డి, అనంత్‌ పజ్జూర్‌, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ అరవింద్‌ రెడ్డి ముప్పిడి, అజయ్‌ రెడ్డి, రఘువీర్‌ బండారు, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్‌ కలసాని, మాధవి లోకిరెడ్డి, చంద్ర పోలీస్‌, అశోక్‌ పొద్దుటూరి, అశ్విన్‌ చక్రవర్తి, ఫణీందర్‌ రెడ్డి, వెంకట్‌ ముసుకు, దామోదర్‌ ఆకుల, సుమన బాసని, నీల్‌లోహిత్‌ కోత్‌, లోకల్‌ కమ్యూనిటీ వాలంటీర్లు మధుమతి వైశ్యరాజు, వెంకటరమణ లష్కర్‌లు కార్యక్రమం విజవంతం కావడానికి కృషి చేశారు.








 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement