stolen vehicles
-
చోరీ బండి.. ఇదిగోనండి
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మూడు నెలల క్రితం చోరీ అయింది. బాధితుడి ఫిర్యాదుతో ఠాణాలో కేసు నమోదైంది. చోరీ చేసిన వ్యక్తి ఈ వాహనంపై గోల్కొండలో సంచరించాడు. విషయం పోలీసులకు తెలియకపోవడంతో వాహనం, చోరుడు చిక్కడం అరుదు.. నగరంలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. చోరీ వాహనాలకు, చోరులకు చెక్ చెప్పడం కోసం నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఐటీ సెల్ ప్రత్యేక చర్యలు తీసుకుంది.రాజధానిలోని 30 జంక్షన్లలో ఉన్న ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) పరిజ్ఞానంతో పని చేసే సీసీ కెమెరాలను వాడుతున్నారు. ఫలితంగా గడచిన రెండు నెలల్లో 12 చోరీ వాహనాలు దొరికాయి. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నేరగాళ్లకు చెక్ చెప్పడానికే డీసీపీ సీహెచ్ రూపేష్ నేతృత్వంలోని ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంను సిద్ధం చేసింది. దీనికోసం కంట్రోల్ రూమ్‌లో సర్వర్ ఏర్పాటు చేసింది. సీసీటీఎన్ఎస్ డేటాతో అనుసం«ధానం.. ⇒ సిటీలోని ఠాణాల్లో నమోదైన ఇతర కేసుల మాదిరిగానే వాహన చోరీల వివరాలూ ఎప్పటికప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్డేట్ అవుతాయి. ⇒ ఈ వివరాలను సేకరిస్తున్న ఐటీ సెల్ ఏఎన్పీఆర్ సిస్టంతో పని చేసే కెమెరాలు అనుసంధానించి ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఆ చోరీ వాహనంలో సదరు 30 జంక్షన్లలోని ఏ కెమెరా నుంచి ముందుకు వెళ్లినా సర్వర్‌లోని సాఫ్ట్వేర్ తక్షణం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని పాప్అప్ రూపంలో కంట్రోల్ రూమ్‌లోని సిబ్బందికి అందిస్తుంది. ఆ రెండు ఠాణాలకు సమాచారం... ఇలా పాప్అప్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆ వివరాలను వాహనం చోరీపై కేసు నమోదైన, అది సంచరిస్తున్న పరిధిలోని ఠాణాలకు అందిస్తున్నారు. ఈ పోలీసుస్టేషన్లకు చెందిన బృందాలు ఆ వాహనం పదేపదే సంచరిస్తున్న ప్రాంతాల్లో మాటు వేసి పట్టుకుంటున్నారు. ఇలా గడిచిన రెండు నెలల్లో 12 వాహనాలు పట్టుకున్నారు. ఇక్కడ ఓ సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో చోరీ వాహనంలో ఓ ప్రాంతంలో సంచరించిన చోరుడు మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటికి నిఘా తగ్గి వాహనం దొరికే అవకాశాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో.. ఈ సమస్యను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తీర్చవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై సంచరిస్తున్న వాహనం ఓ జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్లి మరో జంక్షన్ దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఠాణాలతో పాటు వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ఉన్న జంక్షన్లలోని ట్రాఫిక్ సిబ్బందికీ సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో తక్షణం వాహనాన్ని పట్టుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. చోరీ వాహనాలను చోరులు అమాయకులకు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ కారణంగా వాహనాలు దొరికినా అత్యధిక కేసుల్లో చోరులు మాత్రం చిక్కట్లేదు. -
నంబర్లు మార్చి.. నయా దందా
మిర్యాలగూడ: గడువు తీరిన వాహనాలను స్క్రాప్ కింద తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ప్రమాదానికి గురైన వాహనాల ఇంజిన్, చాసిస్ నంబర్లను వీటికి మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. హైదరాబాద్‌లో చోరీకి గురైన ఒక కారును మిర్యాలగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒకరు ఇటీవల ఆంధ్రాలో కొనుగోలు చేశారు.ఈ కారును మిర్యాలగూడలోని ఓ కారు షెడ్డులో మరమ్మతు చేయిస్తుండగా, కారు జీపీఎస్ ఆన్ అయ్యింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో కారు చోరీకి గురైనట్టు యజమాని అక్కడ ఫిర్యాదు చేశాడు. కారు జీపీఎస్ ఆధారంగా మిర్యాలగూడకు వచ్చిన సదరు యజమాని.. విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కారు ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ మార్చి ఉన్నట్టుగా గుర్తించిన మెకానిక్.. విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో కారు ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరు అమ్మారో చెప్పాలని పోలీసులు మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని ప్రశ్నించారు. ఆయన చెప్పిన వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారైనట్టు తెలిసింది. చాసిస్ నంబర్లు మార్చి అధిక ధరలకు విక్రయాలు సదరు కారు నంబర్ ఎవరు మార్చారు.. ఎలా మార్చారనే విషయాన్ని విచారణ చేసే క్రమంలో మిర్యాలగూడకు చెంది న ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో తాను ఈ కారు నంబర్, చాసిస్ నంబర్ మార్చలేదని.. కానీ, పట్టణంలోని ఒక పార్కింగ్ యార్డు యజమాని పంపించిన 3కార్లకు మాత్రం ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా ఆ పార్కింగ్ యార్డులో 60 రోజుల సీసీ టీవీ ఫుటేజీ అందుబా టులో ఉంటుందని, పోలీసులు ఈ ఫుటేజీని పరిశీలిస్తే ఇలాంటి కార్లు ఎన్ని ఉన్నాయో వెలుగు చూసే అవకాశముంది. బీఎస్–3 వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి...మిర్యాలగూడలోని కారు గురించి కూపీ లాగడంతో బీఎస్– 3 వాహనాల దందా బయటపడింది. 2019లో భారత ప్రభుత్వం నిర్ణీత గడువు తీరిన తర్వాత బీఎస్–3 కార్లను విక్రయించొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో షోరూమ్‌ల యజమానులు చాసిస్, ఇంజిన్ నంబర్లను తొలగించి వాటిని స్క్రాప్ కింద విక్రయించినట్టు సమాచారం. వీటిని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రోడ్డు ప్రమాదాల్లో ధ్వంసమైన కార్ల ఇంజిన్, చాసిస్ నంబర్లను అమర్చి బీఎస్–3 వాహనాలను అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. ఈ దందా భారీగానే కొనసాగుతున్నట్టు సమాచారం. బీఎస్–3 వాహనాలకు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చి విక్రయాలు జరుపుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నా మని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు చెప్పారు. -
అంతా జంక్.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు
Asia's largest 'junk market' shuts down: చోరీ చేసిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి, వాటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్న సోటిగంజ్ మార్కెట్‌ను ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆదివారం సీజ్ చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన కార్లను ఈ మార్కెట్లో విడిభాగాలుగా చేసి ఇల్లీగల్‌గా వ్యాపారం సాగుతోంది. ఈ దందాకు చెందిన హాజీ ఇక్బాల్, హాజీ గల్లా అనే ఇల్లీగల్ గ్యాంగ్స్టర్లు పోలీసులకు పట్టుబడిన తర్వాత సోటిగంజ్ మార్కెట్ మూసివేతకు ఉపక్రమించారు. అంతేకాకుండా కోట్ల విలువచేసే ఆస్తులను కూడా సీజ్ చేశారు. నివేదికల ప్రకారం.. దొంగిలించిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి అక్రమ వ్యాపారం చేయడం ఈ మార్కెట్లో 1990లలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇళ్లలోపల గౌడౌన్లు నిర్మించి దొంగ కార్ల వ్యాపారం ప్రారంభించారు. 1,000 మందికి పైగా పనిచేసే ఈ మార్కెట్లో ప్రస్తుతం దాదాపుగా 300 కంటే ఎక్కువ దుకాణాలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని దుకాణాలను మూసివేయాలని అక్కడి ఎస్హెచ్ఓ ఆదేశించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ కేసులో మీరట్ జిల్లా ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో అక్రమ వ్యాపారం చేస్తున్న 100 షాప్‌లను గుర్తించాం. స్టాక్ సమాచారాన్ని సేకరిస్తే తప్ప, వాటికి ఎలాంటి సరుకులు చేరనివ్వబోమని' వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసేందుకు పరిపాలనా యంత్రాంగం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సోటిగంజ్ మార్కెట్లో 200 మందికి పైగా సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సోటిగంజ్‌లోని ప్రధాన జంక్‌లలో హాజీ గల్లా, హాజీ ఇక్బాల్, హాజీ అఫ్తాబ్, ముష్తాక్, మన్ను అలియాస్ మీనుద్దీన్, హాజీ మొహ్సిన్, సల్మాన్ అలియాస్ షేర్, రాహుల్ కాలా, సలాహుద్దీన్ ఉన్నారు. ఈ స్క్రాపర్లపై 2,500కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. వీరిలో 37 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెల్పింది. చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్ లోన్ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్.. -
పోయిన వాహనాలను గుర్తించే యాప్
చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ఓ యాప్ రూపొందించారు. స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఈ యాప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహేందర్ రెడ్డి చెప్పారు. ఇంజన్ నెంబరు, ఛాసిస్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు.. ఇలా వీటిలో ఏ ఒక్క వివరం ఆధారంగా సెర్చ్ చేసినా కూడా ఈ యాప్ ద్వారా వాహన యజమాని వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు.


