జంక్‌ సామ్రాజ్యం ‘సోటిగంజ్‌’.. చోర్‌ మాల్‌తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు

UP Police Shuts Down Meeruts Sotiganj Market And Seized Properties Worth Crores Of Rupees - Sakshi

1990లో దొంగకార్ల విడిభాగాలతో వ్యాపారం ప్రారంభం

నేడు కోట్ల రూపాయలలో లాభాలు

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం

Asia's largest 'junk market' shuts down: చోరీ చేసిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి, వాటితో జోరుగా వ్యాపారం సాగిస్తున్న సోటిగంజ్‌ మార్కెట్‌ను ఉత్తరప్రదేశ్‌ యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం ఆదివారం సీజ్‌ చేసింది. ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దొంగిలించిన కార్లను ఈ మార్కెట్‌లో విడిభాగాలుగా చేసి ఇల్లీగల్‌గా వ్యాపారం సాగుతోంది. ఈ దందాకు చెందిన హాజీ ఇక్బాల్‌, హాజీ గల్లా అనే ఇల్లీగల్‌ గ్యాంగ్‌స్టర్లు పోలీసులకు పట్టుబడిన తర్వాత సోటిగంజ్‌ మార్కెట్‌ మూసివేతకు ఉపక్రమించారు. అంతేకాకుండా కోట్ల విలువచేసే ఆస్తులను కూడా సీజ్‌ చేశారు.

నివేదికల ప్రకారం.. దొంగిలించిన కార్లను విడిభాగాలుగా విడగొట్టి అక్రమ వ్యాపారం చేయడం ఈ మార్కెట్‌లో 1990లలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇళ్లలోపల గౌడౌన్లు నిర్మించి దొంగ కార్ల వ్యాపారం ప్రారంభించారు. 1,000 మందికి పైగా పనిచేసే ఈ మార్కెట్‌లో ప్రస్తుతం దాదాపుగా 300 కంటే ఎక్కువ దుకాణాలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని దుకాణాలను మూసివేయాలని అక్కడి ఎస్‌హెచ్‌ఓ ఆదేశించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ఈ కేసులో మీరట్ జిల్లా ఎస్‌ఎస్పీ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ మార్కెట్లో అక్రమ వ్యాపారం చేస్తున్న 100 షాప్‌లను గుర్తించాం. స్టాక్ సమాచారాన్ని సేకరిస్తే తప్ప, వాటికి ఎలాంటి సరుకులు చేరనివ్వబోమని' వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూసేందుకు పరిపాలనా యంత్రాంగం ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సోటిగంజ్‌ మార్కెట్లో 200 మందికి పైగా సైనికులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

సోటిగంజ్‌లోని ప్రధాన జంక్‌లలో హాజీ గల్లా, హాజీ ఇక్బాల్, హాజీ అఫ్తాబ్, ముష్తాక్, మన్ను అలియాస్ మీనుద్దీన్, హాజీ మొహ్సిన్, సల్మాన్ అలియాస్ షేర్, రాహుల్ కాలా, సలాహుద్దీన్ ఉన్నారు. ఈ స్క్రాపర్లపై 2,500కు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. వీరిలో 37 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెల్పింది.

చదవండి: తక్కువ వడ్డీ పేరిట అదితి గోల్డ్‌ లోన్‌ సంస్థ ఘరానా మోసం! కిలోల బంగారంతో పరార్‌..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top