breaking news
state leval
-
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్‌ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. -
శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం
కోల్‌కతా: శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశమని, దానితో గవర్నర్‌కు సంబంధం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకంటూ గవర్నర్ కేసరీనాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై మమత గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘గవర్నర్ ప్రయత్నం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని మమత ఆరోపించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినందునే ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశానికి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థ చటర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కాంగ్రెస్, సీపీఎం రాష్ట్ర నేతలు సోమేన్ మిత్రా, సూర్య కాంత మిశ్రా హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం మమత పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్ మజుందార్ అన్నారు. జూ.డా.ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం వెనుక రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం, బీజేపీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీపీఎం సాయంతో వైద్యుల సమ్మెకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. -
రామకృష్ణకు రాష్ట్రస్థాయి పురస్కారం
కరీంనగర్‌కల్చరల్: ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, అధ్యాపకుడు కల్వకుంట రామకృష్ణ తేజ ఆర్ట్ క్రియేషన్స్ వారి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రామకృష్ణ చేస్తున్న సాహితీ సేవలను ప్రశంసించారు. ఆయనకు ప్రశంసపత్రం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప, కసిరెడ్డి వెంకటరెడ్డి, దేవదాసు, శ్రీరంగాచార్య, ఆచార్య భాగయ్య, తేజ ఆర్ట్స్ చైర్మన్ పోరెడ్డి రంగయ్య, యువభారతి అధ్యక్షుడు వేద చంద్రయ్య, చిమ్మపూడి శ్రీరామమూర్తి, సోమ సీతారాములు, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


