breaking news
Sringeri seat
-
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై పశ్చిమ బెంగాల్లో రభస కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మే 11 అంటే సోమవారం సుప్రీంకోర్టులోనూ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ దక్కించుకుంది. తీర్పు ఇస్తున్న సందర్భంగా ‘‘ప్రజాస్వామ్యం హైజాక్ అయ్యేందుకు అనుమతించం’’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా.. వివరాలు ఇలా ఉన్నాయి..2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్‌లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.రిటర్నింగ్ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.క్రిమినల్ కేసును విస్మరించారు...హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్ సందర్భంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు 248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్‌కు ముందే బ్యాలెట్ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్ కె.ఎన్.రమేశ్, రిటర్నింగ్ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చివరకు సుప్రీంకోర్టు చొరవతో శృంగేరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ వశమైంది.పెద్ద ఎత్తున జరిగి ఉంటే...శృంగేరి అసెంబ్లీ స్థానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ స్పందించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతూ కెమెరాకు చిక్కడం, హర్యానా పంచాయితీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారైన విషయాన్ని, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపే ప్రస్తావిస్తూ.... కర్ణాటక మాదిరిగానే దేశంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు తప్పు చేసి ఉంటే న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాల విషయంలో హెచ్చరించడం, లేదా ఖండించడం శిక్ష కిందకు రాదని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వెంకన్న సన్నిధి నుంచి... శృంగేరి పీఠానికి
శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారు పీఠానికి ఉత్తరాధికారిగా తిరుపతికి చెందిన కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మను నియమిస్తున్నట్లు ప్రకటించారు. శృంగేరీ పీఠానికి 37వ అధిపతిగా... జగద్గురువుగా భాసిల్లనున్న శర్మ జీవిత విశేషాలివీ... ...::: సహదేవ కేతారి, సాక్షి, తిరుమల సుమారు పన్నెండొందల సంవత్సరాల కిందట దక్షిణ భారతీయుల ఫుణ్యఫలంగా కేరళలోని కాలడి సమీపాన పూర్ణానది తీరంలో శంకరులుగా అవతరించారు శంకర భగవత్పాదులు. అందుకే ఆయన ఆది శంకరులు అయ్యారు. ఆయన తన ఎనిమిదో యేటనే చతుర్వేదాలను ఔపోసన పట్టారు. తాను భౌతికంగా ఉన్న 32 ఏళ్లలో 12 ఏళ్ల పాటు సమస్త వైదిక విద్యలు అధ్యయనం చేశారు. పదహారేళ్లకే శంకరభాష్యాలు (ప్రస్థానత్రయం) రాశారు. మిగిలిన పదహారేళ్లకే దేశమంతా విజయ యాత్ర చేశారు. ‘అద్వైతం’ అనే వేద ధర్మాన్ని స్థాపించారు. నలుగురు శిష్యులను తయారు చేశారు. ఆ నలుగురు శిష్యులతో ప్రపంచ యాత్ర చేస్తూ శంకరులవారు శృంగేరి లోని తుంగానది తీరంలోకి వచ్చారు. అక్కడ ఆశ్చర్యకమైన సంఘటన చూశారు. ఒక కప్ప ప్రసవిస్తోంటే దానికి పాము తన పడగ నీడ పడుతోంది. సహజవైరం కలిగిన జంతువులే అలా మిత్రబంధంతో ఉండే స్థల మహత్యాన్ని గుర్తించారు. అందుకే మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని సంకల్పించారు. తన శిష్యపరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యులవారిని నియమించారు. సాక్షాత్తు సరస్వతీదేవిని శారదాదేవిగా ప్రతిష్టింపచేశారు. ఆ పరంపరలో ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 36వ పీఠాధిపతి. ఆయనే ఇప్పుడు ఉత్తరపీఠాధికారిగా వేంకటేశ్వర ప్రసాద శర్మను ప్రకటించారు. శర్మ తండ్రి శివసుబ్రహ్మణ్య అవధాని. వేదాధ్యయనం కోసం స్కూలు మాన్పించారు కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ తమ తలిదండ్రులకు మూడో సంతానం. ఎల్కేజీ నుంచి రెండో తరగతి వరకు సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయలో చదివారు. తర్వాత తండ్రి అతడిని స్కూల్ మాన్పించి తాతగారు కుప్పారామగోపాల వాజపేయయాజి దగ్గర కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేయించారు. అలా శర్మకు తాతగారే తొలిగురువు. తొమ్మిదేళ్లలో శర్మ కృష్ణయజుర్వేదం పూర్తి చేశారు. అనంతరం శృంగేరీలో చేరారు. అక్కడ ఐదేళ్లపాటు సంస్కృత సాహిత్యం, తర్కశాస్త్రం అభ్యసించారు. శర్మ ప్రస్తుతం వేదాంత శాస్త్రం చదువుతున్నారు. పండిత వంశం శర్మ తండ్రి ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. దానికి ముందు కీసరగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్‌గా పద్దెనిమిదేళ్ల పాటు సేవలందించారు. కీసరగుట్టకు బదలీ కావడానికి కొద్ది రోజుల ముందే తిరుపతిలో శర్మ పుట్టాడు. (అప్పటికి ఆయన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వేద పారాయణదారుగా ఉన్నారు). శ్రీగోవింద రాజస్వామి జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రంలో పుట్టడం, అదీ శనివారం కావడంతో తనయుడికి ఆ స్వామివారి పేరే పెట్టుకున్నారు శివ సుబ్రహ్మణ్య అవధాని. శర్మ పుట్టకముందు ఆయన తిరుమల ఆలయంలో వేద పారాయణదారుగా ఉండేవారు. పీఠంలో ప్రాంతీయ భేదం ఉండదు శృంగేరి పీఠం వైదిక విద్యాపీఠం. వైదిక విద్యలన్నీ సంస్కృత మాధ్యమంగానే ఉంటాయి. అక్కడ తెలుగువాళ్లు, తమిళులు. కన్నడిగులు అన్న తేడా ఉండదు. అది పూర్తిగా పండితపీఠం. 36వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి పట్టాభిషిక్తులై 25 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా పట్టాభిషేక రజతోత్సవాలు ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి శిష్యగణం భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆ రజతోత్సవానికి శర్మ తల్లిదండ్రులు, తాతగారు, అవ్వ (నాయనమ్మ) అంతా కలిసి వెళ్లారు. నాలుగో తేది సాయంత్రం శర్మ తండ్రికి మహాస్వామివారి నుంచి పిలుపువచ్చింది. కుమారుడితో కలిసి ఆయన స్వామివారి ఏకాంత మందిరానికి వెళ్లారు. ‘‘అమ్మవారి ఆజ్ఞగా మీ అబ్బాయిని ఉత్తరాధికారిగా నియమిస్తున్నాము... మీకు సమ్మతమేనా’’ అని జగద్గురువు అడిగారు. ‘‘తమరి ఆజ్ఞ. శిరోధార్యం’’ అంటూ శర్మ తండ్రి తలూపారు. ఆ రోజు రాత్రి అందరి సమక్షంలో శర్మ పేరును ఉత్తరాధికారిగా ప్రకటించారు మహాస్వామి. పీఠం ఉత్తరాధికారిగా శర్మను ఈనెల 22, 23వ తేదీల్లో వైదిక కార్యక్రమాలతో ప్రకటిస్తారు. జగద్గురువు సమక్షంలో ఉత్తరాధికారిగా వైదిక సంస్కారాలు చేస్తారు. పేరు: కుప్పా వేంకటేశ్వర ప్రసాదశర్మ వయసు: 21 సంవత్సరాలు పుట్టిన తేది: 24-07-1993 పుట్టిన స్థలం: తిరుపతి తల్లిదండ్రులు: కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, సీతానాగలక్ష్మి అన్న: కుప్పా వేంకట కౌండిన్యశర్మ (27) ఇంజినీరు, ముంబయి అక్క: శ్రీకృష్ణప్రియ (24) అమెరికా తాత: కుప్పా రామగోపాల వాజపేయయాజి అవ్వ: కల్పకాంబ సోమపీఠిని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శృంగేరీ పీఠానికి మా కడుపున పుట్టిన బిడ్డ ఉత్తరాధికారి (భవిష్యత్‌లో పీఠాధిపతి)గా జగద్గురువు ప్రకటించటం ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో! అది మాటలతో చెప్పలేనిది. అది సాక్షాత్తు శంకరులు అధిష్ఠించిన పీఠంగానే భావిస్తాం. ఫిబ్రవరి రెండోవారంలో మా పెద్దబ్బాయి పెళ్లి ఉంది. ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టాక వారు (కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ) ఇక్కడకు రాలేరు. ఆ తర్వాత మా కుటుంబమే ఆయన వద్దకెళ్లి ఆశీస్సులు అందుకుంటాము. - కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శర్మ తండ్రిౠధత


