breaking news
Sovereign Gold Bond
-
‘ఏంటి మేడమ్ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.గోల్డ్ బాండ్ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను విధానం ఇన్వెస్టర్ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇప్పటివరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్‌ఫోలియో XIRRలు (ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్ వాదిస్తున్నారు.WOW!The government will deserve its share of your PPF, EPF withdrawals too.It'll deserve its share of your NPS gains too.And what logic is this? "If you are making a killing, why shouldn't I get something?"Madam, your government only told us to go ahead and buy SGBs… pic.twitter.com/8KYhZ2Kxx9— Kanan Bahl (@BahlKanan) February 4, 2026 -
ఎస్‌జీబీలతో కేంద్ర ఖజానాకు గండి!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సార్వభౌమ గోల్డ్ బాండ్ (సావరిన్ గోల్డ్ బాండ్స్-SGB) రిడెంప్షన్ల భారం ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ వ్యయాన్ని తట్టుకునేందుకు రానున్న బడ్జెట్లో ‘గోల్డ్ రిజర్వ్ ఫండ్’ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.నిధుల కేటాయింపులో భారీ వ్యత్యాసంగత కొన్నేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.8,550 కోట్లు కేటాయించగా, రిడెంప్షన్ల ఒత్తిడి వల్ల సవరించిన అంచనాల్లో అది ఏకంగా రూ.28,000 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) కేవలం రూ.700 కోట్లే ప్రాథమికంగా కేటాయించినప్పటికీ వాస్తవ రిడెంప్షన్ల దృష్ట్యా దీన్ని భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్ అంచనాల్లోనూ ఈ నిధికి సింహభాగం కేటాయించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.పెరుగుతున్న భారంఎస్జీబీ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. బాండ్లు జారీ చేసినప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ ధరలు 4 నుంచి 5 రెట్లు పెరగడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.సార్వభౌమ గోల్డ్ బాండ్ (SGB) పథకంలో భాగంగా 2017-18 సిరీస్ కింద జారీ చేసిన బాండ్ల ధరలను పరిశీలిస్తే అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.2,881 నుంచి రూ.2,951 మధ్య ఉంది. అయితే, ఈ బాండ్లు మెచ్యూరిటీ సమయానికి బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు ఒక్కో గ్రాముపై రూ.9,486 నుంచి రూ.13,486 వరకు రిడెంప్షన్ ధరను పొందగలిగారు. అంటే జారీ చేసిన ధరతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు అధిక లాభం చేకూరింది.ఇక 2018-19 సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఐదో ట్రాంచ్ (5th Tranche) బాండ్లు ముందస్తు రిడెంప్షన్‌కు (Premature Redemption) అవకాశం లభించింది. ఈ క్రమంలో వీటిని ఒక్కో యూనిట్‌కు రూ.14,853 గరిష్ట ధర వద్ద రిడీమ్ చేయడం గమనార్హం. ఇది అప్పట్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గ్రాముకు రూ.16,000 మార్కును దాటి కొనసాగుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదల వల్ల రాబోయే కాలంలో రిడెంప్షన్ కావాల్సిన బాండ్ల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.2026-27లో 2018-19 సిరీస్‌కు చెందిన 6 ట్రాంచ్‌లు తుది రిడెంప్షన్‌కు రానున్నాయి. అలాగే 2021-22 సిరీస్‌కు చెందిన 10 ట్రాంచ్‌లు ముందస్తు రిడెంప్షన్‌కు అర్హత సాధించనున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపనున్నాయి.కొత్త బాండ్ల జారీకి బ్రేక్భౌతిక బంగారం దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 146 టన్నులకు పైగా బంగారానికి సమానమైన పెట్టుబడులు వచ్చాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వానికి ఇది భారంగా మారింది. 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 వరకు మొత్తం 67 ట్రాంచ్‌లు జారీ అయ్యాయి. పెరుగుతున్న ఆర్థిక భారంతో 2024 తర్వాత ప్రభుత్వం కొత్త ట్రాంచ్‌లను జారీ చేయలేదు. భవిష్యత్తులోనూ కొత్త బాండ్లు వచ్చే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.ధర నిర్ణయం ఇలా..ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత గల బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. రిడెంప్షన్ తేదీకి ముందున్న చివరి మూడు వ్యాపార దినాల సగటు ధర ఆధారంగా పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తారు.ఇదీ చదవండి: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. -
గోల్డ్ బాండ్లు కొన్నవారికి 193 శాతం లాభం
-
గోల్డ్ బాండ్ గ్రాము @ రూ. 5,611
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్ విలువకు రూ. 50 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్(ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్‌ను అనుమతిస్తారు. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్ గోల్డ్‌కు కాకుండా సావరిన్ గోల్డ్ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్‌గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్‌యూఎఫ్‌లకు 4 కేజీలు, ట్రస్ట్‌లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. -
గోల్డ్ బాండ్ల ధర గ్రాము రూ.2,901
24 నుంచి 28 వరకూ ఆఫర్ ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచీ ఏప్రిల్ 28వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ బాండ్ ధర గ్రాముకు రూ.2,901 అని ఒక ప్రకటనలో తెలిపింది. బాండ్లు మే 12వ తేదీన జారీ అవుతాయి. సబ్‌స్క్రిప్షన్‌కు వారం ముందు (సోమవారం–శుక్రవారం) ఇండియన్ బులియన్ అండ్ జ్యూయెలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 ప్యూరిటీ గోల్డ్ ధర గ్రాముకు సగటున రూ.2,951గా నమోదయ్యింది. దీనితో ముందే నిర్ణయించిన ప్రకారం– బాండ్ ధరను రూ.50 రిబేట్ ప్రాతిపదికన రూ.2,901గా స్థిరీకరించారు. ఈ బాండ్‌పై వార్షిక వడ్డీ 2.75 శాతం. తొలి ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతి ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బాండ్ల కాలపరమితి ఐదవ ఏడాది నుంచీ ‘ఎగ్జిట్’ ఆప్షన్‌తో ఎనిమిది సంవత్సరాలు. ఒక వార్షిక సంవత్సరంలో గ్రాము నుంచి 500 గ్రాముల వరకూ ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. బ్యాం కులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్), నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్, బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బాండ్లు అందుబాటులో ఉంటాయి. -
గోల్డ్ బాండ్ స్కీమ్ 4వ విడత నెలాఖర్లో
న్యూఢిల్లీ: నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్ జూన్ నెల చివరిలో ప్రారంభం కానున్నది. తాజా గోల్డ్ బాండ్ స్కీమ్ అంశంపై కసరత్తు చేస్తున్నామని, ఇది ఈ నెల చివరిలో ప్రారంభం కావొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ తెలిపారు. ఎస్జీబీ స్కీమ్‌కు ఇన్వెస్టర్ల స్పందన అంతంత మాత్రంగానే ఉందని, దీనికి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోల్డ్ బాండ్ల డీమ్యాట్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. రానున్న 1-2 నెలల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింట్ అమల్లోకి రావచ్చని తెలిపారు.


