breaking news
Sikkim border
-
సొరంగంలో విషాదం.. పలువురు కార్మికులు గల్లంతు!
సమర్డోంగ్: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ సిక్కిం జిల్లాలోని సమర్డోంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా కొండచరియలు విరిగిపడి సొరంగం దెబ్బతిన్నది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 27 మంది వరకు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే బాధితులను రంగపో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అయితే, సొరంగంలోకి విషపూరిత వాయువులు వ్యాపించడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పేలుడు ధాటికి సొరంగం ఒక భాగం పూర్తిగా ధ్వంసమై దారి మూసుకుపోయింది. నామ్చి జిల్లా కలెక్టర్ అనూపా తామ్లింగ్ మాట్లాడుతూ, సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షణ పరికరాలు లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రమాదకర పరిస్థితుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం! -
టిబెట్లో చైనా సైనిక బలప్రదర్శన
బీజింగ్: సిక్కిం సరిహద్దులో భారత్తో ఉద్రిక్తత నేపథ్యంలో చైనా సైన్యం టిబెట్ పీఠభూమిపై బలప్రదర్శన చేసింది. పీఠభూముల్లో దాడులు చేసే సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి 5వేల అడుగుల ఎత్తులోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఈ నెలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక విన్యాసాలు చేసినట్లు చైనా ఆర్మీ తెలిపింది. యుద్ధ విమానాలు, ట్యాంకులు, బంకర్లపై దాడి చేసే గ్రెనేడ్లు, క్షిపణులు, శతఘ్నులను సైనికులు వాడుతున్నట్లున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. టిబెట్ మిలటరీ కమాండ్ జవాన్లు.. 11 గంటలపాటు కాల్పులు, వేగంగా మోహరింపు, బహుళ దళాల సంయుక్త దాడి, యుద్ధ విమానాల నుంచి రక్షణ తదితర విన్యాసాలు చేశారని చైనా డైలీ తెలిపింది. విన్యాసాలు సోమవారం కూడా కొనసాగాయి.


