breaking news
Senior teachers
-
సీనియర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ షాకిచ్చిన వేళ.. పక్క రాష్ట్రం తమిళనాడు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు(2010 కంటే ముందు) టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని మంగళవారం విజయ్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.సీనియర్ టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి మినహాయింపునకు సంబంధించిన తీర్మానాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తిగా, శాశ్వతంగా మినహాయించాలని అందులో కోరారాయన. ఈ ప్రతిపాదన ద్వారా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.3.28 లక్షల మందికి ప్రయోజనం2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన సుమారు 3,28,701 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ నిబంధన పరిధిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో చాలామంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరీక్ష రాయాల్సి రావడం వారి ఉద్యోగ భద్రత, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు.Minister Rajmohan has moved a resolution urging the Central Government to exempt teachers who joined service before 2010 from the Teacher Eligibility Test (TET). pic.twitter.com/p4PiMcJFmL— Vignesh Theni (@Vignesh_twitz) August 25, 2026కేంద్రాన్ని కోరిన తమిళనాడుసీనియర్ టీచర్లకు ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరుతున్నట్లు రాజ్‌మోహన్ తెలిపారు. ఇందుకోసం 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రమోషన్లకు ఇబ్బంది లేకుండా..టెట్ నిబంధన కారణంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ప్రయోజనాలు, ముఖ్యంగా పదోన్నతులు నిలిచిపోకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి నుంచి తప్పించడం ద్వారా వారి సర్వీస్ ప్రయోజనాలను కాపాడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది.ఏపీలో ఇదే అంశంపై కొంతకాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కనీసం మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలో 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, NCTE స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఆరెస్సెస్ స్కెచ్.. జెన్‌జీ టార్గెట్ -
టెన్త్ స్పాట్‌కు సీనియర్ టీచర్ల కొరత
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంక న ప్రక్రియ(స్పాట్)కు సీనియర్ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలకు సరిపడ సీనియర్ ఉపాధ్యాయులు కంటే 15 శాతం అదనంగా ఉపాధ్యాయులను ఎంపిక చేసినా గురువారం నాటికి వంద మంది వరకు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు విద్యాశాఖాధికారులు గుర్తించారు. తొలుత ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాపై వచ్చిన అభ్యంతరాల వల్ల కొందరికి అనుమతి నిరాకరించగా.. పలువురు సీనియర్లు అనారోగ్యంతో విధులకు రాలేమ ని చెప్పడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా సీనియూర్టీ ఉన్నా ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసి టెన్త్ సబ్జెక్టులు బోధించని వారు కావడంతో పలువురికి విధులు అప్పగించలేదు. దీంతో దాదాపు అన్ని సబ్జెక్టులకు ఈ సమస్య అనివార్యమైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా విద్యాశాధికారి జి.కృష్ణారావు, ఉప విద్యాశాఖాధికారులు నాగమణి, సత్యనారాయణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. తాజా సీనియూర్టీ జాబితాను తీసుకొని విధులకు హాజరు కావాలని కోరుతూ నేరుగా ఉపాధ్యాయునికి బుధవారం సాయంత్రం ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చా రు. ఈ మేరకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు సరిపడే సంఖ్యలో గురువారం ఉదయం హాజరయ్యూరని జిల్లా విద్యాశాఖాధికారి జి.కృష్ణారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. విద్యుత్ కోతకు ప్రత్యామ్నాయ చర్యలు విద్యుత్ కోత వల్ల మూల్యాంకన ప్రక్రియకు ఆటంకం జరగకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ను ఏర్పాటు చేశామని డీఈఓ కృష్ణారావు చెప్పారు. మూల్యాంకన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో కొన్ని గదులకు విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని లేకుం టే చీకట్లు ఏర్పడతాయని తెలిపారు. ఇటువంటి చోట్ల స్పాట్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండే లా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మహిళా టీచర్లకు కనీస సదుపాయూలు కల్పించామని తెలిపారు. -
టీచర్లకు పండగ
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ వచ్చింది. పదోన్నతి ఎవరిని వరి స్తుందో ఎవరికి దూరమవుతుందో తేలాల్సి ఉంది. మూడు నెలలుగా పదోన్నతుల ఖాళీల కోటా భర్తీ చేయక పోవడం వల్ల పోస్టులు భారీ సంఖ్యలో నిల్వ ఉన్నాయి. నిబంధనల మేరకు ప్రతి నెలాఖరులోగా ఖాళీల పదోన్నతి కోటాను భర్తీ చేయాల్సి ఉంది. విద్యాశాఖ సిబ్బంది సమ్మె నేపథ్యం లో మూడు నెలలుగా భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడు నెలలుగా వివిధ కేట గిరీల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిలో 216 వరకూ ఖాళీలు పదోన్నతి కోటా ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు పదోన్నతుల కోటా ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సీనియార్టీ జాబితాల విడుదల, దాని పై అభ్యంతరాల నివృత్తి, తుదిజాబితా విడుదల వంటి ప్రక్రియ వారం రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శరవేగంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఖాళీలుండడం వల్ల వారిపై పలురకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. ఖాళీలు అధికంగా మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల అర్హులైన ఉపాధ్యాయుల ఆసక్తి పెరిగింది. దీంతో సీనియార్టీ జాబితాపై తాజా విద్యార్హతలు జతచేసిన వారి సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగింది. తొలు త విడుదల చేసిన సీనియార్టీ జాబితాపై 300 మంది తమ అభ్యంతరాలు(తాజా అర్హతలు జత చేయాలని) పంపారు. దీంతో అభ్యంతరాలలోని విద్యార్హతలను పరిశీ లించి, జాబితాలో జోడించడానికి విద్యాశాఖకు వారం రోజుల సమయం పట్టింది. చివరికి సోమవారం సాయంత్రం సీనియార్టీ తుది జాబి తాను వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ జి.కృష్ణారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఏర్పడిన తాజా ఖాళీలలో సీనియర్లతో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. పదోన్నతులకు కేటాయించిన 216 పోస్టులలో కేవలం 22 మాత్రమే బ్యాక్లాగ్ కోటాకు చెందినవని తెలిపారు.


