టీచర్లకు పండగ | Senior teachers got promotions | Sakshi
Sakshi News home page

టీచర్లకు పండగ

Nov 5 2013 3:00 AM | Updated on Sep 2 2017 12:16 AM

జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ వచ్చింది. పదోన్నతి ఎవరిని వరి స్తుందో ఎవరికి దూరమవుతుందో తేలాల్సి ఉంది.

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ వచ్చింది. పదోన్నతి ఎవరిని వరి స్తుందో ఎవరికి దూరమవుతుందో తేలాల్సి ఉంది. మూడు నెలలుగా పదోన్నతుల ఖాళీల కోటా భర్తీ చేయక పోవడం వల్ల పోస్టులు భారీ సంఖ్యలో నిల్వ ఉన్నాయి. నిబంధనల మేరకు ప్రతి నెలాఖరులోగా ఖాళీల పదోన్నతి కోటాను భర్తీ చేయాల్సి ఉంది. విద్యాశాఖ సిబ్బంది సమ్మె నేపథ్యం లో మూడు నెలలుగా భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడు నెలలుగా వివిధ కేట గిరీల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిలో 216 వరకూ ఖాళీలు పదోన్నతి కోటా ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు  పదోన్నతుల కోటా ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సీనియార్టీ జాబితాల విడుదల, దాని పై అభ్యంతరాల నివృత్తి, తుదిజాబితా విడుదల వంటి ప్రక్రియ వారం రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శరవేగంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఖాళీలుండడం వల్ల వారిపై పలురకాల ఒత్తిళ్లు  వస్తున్నాయి.

ఖాళీలు అధికంగా మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల అర్హులైన ఉపాధ్యాయుల ఆసక్తి పెరిగింది. దీంతో సీనియార్టీ జాబితాపై తాజా విద్యార్హతలు జతచేసిన వారి సంఖ్య కూడా ఒక్కసారిగా  పెరిగింది. తొలు త విడుదల చేసిన సీనియార్టీ  జాబితాపై 300 మంది తమ అభ్యంతరాలు(తాజా అర్హతలు జత చేయాలని) పంపారు. దీంతో అభ్యంతరాలలోని విద్యార్హతలను పరిశీ లించి, జాబితాలో జోడించడానికి విద్యాశాఖకు వారం రోజుల సమయం పట్టింది. చివరికి సోమవారం సాయంత్రం సీనియార్టీ తుది జాబి తాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు  డీఈఓ జి.కృష్ణారావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అదే విధంగా జిల్లాలో  ఏర్పడిన తాజా ఖాళీలలో సీనియర్లతో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. పదోన్నతులకు కేటాయించిన 216 పోస్టులలో కేవలం 22 మాత్రమే బ్యాక్‌లాగ్ కోటాకు చెందినవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement