breaking news
Senior Boxing Championship
-
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి నిరాశ పరిచిన నిఖత్... ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పకడ్బందీగా సిద్ధమవుతోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ బాక్సర్... గాయం నుంచి కోలుకొని రింగ్‌లో మళ్లీ మెరిపిస్తోంది. తాజాగా జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్ తన పంచ్ పవర్‌తో ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాదిని టైటిల్‌తో ప్రారంభించేందుకు సిద్ధమైన ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్... సీజన్ మొత్తం ఇదే జోరు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. అడ్డంకులు ఎదురైనా..‘క్రీడల్లో ఎత్తుపల్లాలు సహజం. ఒక అథ్లెట్ అన్నివేళలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోవచ్చు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. కొన్నికొన్ని సార్లు అడ్డంకులు ఎదురవుతాయి. అప్పుడే మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలుసుకునేందుకు అవకాశం చిక్కుతుంది. దాన్ని గుర్తించి అధిగమించగలిగితే ఎదురుండదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నించడం ముఖ్యం’ అని నిఖత్ వెల్లడించింది. ఆటుపోట్లను దాటుకుంటూ... 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలతో నిఖత్ దుమ్మురేపింది. దీంతో విశ్వక్రీడల్లో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడగా... పారిస్ ఒలింపిక్స్ ప్రిక్వార్టర్స్‌లో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి చేరింది. నిరాశ చెందానుఆ తర్వాత నిఖత్‌కు మోకాలి గాయం అయింది. దాని నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె గతేడాది జూలైలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి ఒలింపిక్ పతక విజేత చేతిలో ఓడింది. ‘ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ చేతిలో ఓడాను. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉత్తచేతులతో వచ్చినందుకు నిరాశ చెందాను’ అని ఆమె వెల్లడించింది. తనకు ఎదురుదెబ్బలు సహజమే అని... జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ఈ స్థాయికి చేరినట్లు 29 ఏళ్ల నిఖత్ చెప్పింది. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న సమయంలో ఇదే బరువు కేటగిరీలో ఉన్న నిఖత్... ఎన్నో ఏళ్ల పాటు ఓపికగా ఎదురుచూసింది. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒలింపిక్ చాంపియన్ కావాలని‘నా జీవితం అంత సులువైందేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డాను. అన్నీ సజావుగా సాగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రపంచ చాంపియన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. దాని కోసం నా యావత్ శక్తిని ధారపోశాను. దాని వల్లే వరల్డ్ చాంపియన్‌గా ఎదగగలిగాను. ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కావాలని అంతే తపనతో కోరుకుంటున్నా. ముందు మనపై మనకు నమ్మకం లేకుంటే... అది వాస్తవ రూపం దాల్చదు. దాని కోసం కోచ్ సన్నీ గెహ్లావత్తో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నా’ అని నిఖత్ వివరించింది. తప్పులను సరిదిద్దుకుంటూ... లాస్ ఏంజెలిస్ క్రీడల్లో నిఖత్‌ను చాంపియన్‌గా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నామని సన్నీ పేర్కొన్నాడు. ‘ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. చిన్న చిన్న తప్పులను గుర్తించి వాటిని అధిగమించేందకు ప్రయత్నిస్తున్నాం. కౌంటర్ అటాక్ విషయంలో మరింత మెరుగయ్యే ప్రయత్నాలు సాగుతున్నాయి. రింగ్‌లో నిఖత్ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌ను వినియోగిస్తుంది. దాంట్లో కొన్ని మెళకువలు నేర్చుకుంటోంది. టెక్నిక్‌తో పాటు వ్యూహాలపై దృష్టి పెట్టాం’ అని సన్నీ గెహ్లావత్ చెప్పాడు. 2028 ఒలింపిక్స్ సమయానికి నిఖత్ వయసు 32 ఉండనుంది కాబట్టి అందకు తగ్గట్లు శిక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. 2026 తనకెంతో ముఖ్యమని... ఆరంభంలోనే జాతీయ చాంపియన్‌గా నిలిస్తే... ఏడాదంతా అదే జోరు కొనసాగించవచ్చని నిఖత్ వెల్లడించింది. అదంత సులువు కాకపోయినా... దేశానికి పతకాలు సాధించి పెట్టాలనే తపనే తనను ముందుకు తీసుకెళ్తుందని తెలంగాణ బాక్సర్ పేర్కొంది. చదవండి: WPL 2026: డిక్లెర్క్ ధమాకా -
భారత్ తీన్మార్ పంచ్...
విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు. పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు. తాస్కాంట్: ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్‌లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిగిత్ దిషిబయేవ్ (కిర్గిస్తాన్)పై, హుసాముద్దీన్ 4–3తో దియాజ్ ఇబానెజ్ (బల్గేరియా)పై, నిశాంత్ దేవ్ 5–0తో జార్జి టెరీ క్యూలార్ (క్యూబా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. ప్రపంచ పురుషుల బాక్సింగ్‌లో పవర్ హౌస్‌గా పేరున్న క్యూబా దేశ బాక్సర్‌పై భారత బాక్సర్ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్‌ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్ దేవ్ నిరూపించాడు. జార్జి క్యూలార్‌తో జరిగిన బౌట్లో నిశాంత్ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్ ఈసారి సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు. 10 ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించగా... విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. -
రెండో రౌండ్లో భారత బాక్సర్ నీతూ
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నీతూ శుభారంభం చేసింది. ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం తొలి రౌండ్లో నీతూ 5–0తో స్టెలుటా దుతా (రొమేనియా)పై నెగ్గింది. నేడు జరిగే బౌట్లలో హెరెరా (మెక్సికో)తో నిఖత్ జరీన్ (51 కేజీలు), కళా థాపా (నేపాల్)తో మనీషా (57 కేజీలు), మరియా బోవా (ఉక్రెయిన్)తో పర్వీన్ (63 కేజీలు), కెర్రీ డేవిస్ (ఇంగ్లండ్)తో సవీటి (75 కేజీలు) పోటీపడతారు. -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
వికాస్, శివ శుభారంభం
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై పోటీపడుతున్నారు. మంగళవారం తొలి రౌండ్లో వికాస్ 3-0తో జోల్టాన్ హర్సా (హంగేరి)పై, శివ థాపా 3-0తో ఖలీల్ లిటిమ్ (అల్జీరియా)పై విజ యం సాధించగా... మనోజ్ కుమార్ 1-2తో అబ్దెల్హక్ అతాక్ని (మొరాకో) చేతిలో, దేవేంద్రో సింగ్ 1-2తో హార్వీ హోర్న్ (బ్రిటన్) చేతిలో ఓడారు.


