భారత్‌కు ఐదు పతకాలు ఖాయం | India secures five more medals at Asian Senior Boxing Championships | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఐదు పతకాలు ఖాయం

Apr 6 2026 3:46 AM | Updated on Apr 6 2026 3:46 AM

India secures five more medals at Asian Senior Boxing Championships

సెమీస్‌లో జైస్మీన్, మీనాక్షి, లోకేశ్, ఆకాశ్, హర్ష్

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్స్‌ జైస్మీన్‌ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు)... పురుషుల విభాగంలో లోకేశ్‌ (85 కేజీలు), ఆకాశ్‌ (75 కేజీలు), హర్ష్చౌధరీ (90 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. 

జియి చెన్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జైస్మీన్‌ 5–0తో... యుకా సదమత్సు (జపాన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మీనాక్షి 5–0తో ఏకపక్ష విజయాలు అందుకున్నారు. లోకేశ్‌ 5–0తో గిచాయి కిమ్‌ (దక్షిణ కొరియా)పై, ఆకాశ్‌ 5–0తో యాలాస్‌ బగ్తియరోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)పై, హర్ష్5–0తో తినిస్తాన్‌ అలీబయెవ్‌ (కిర్గిస్తాన్‌)పై గెలుపొందారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మహిళల విభాగంలో బరిలోకి దిగిన 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్‌ చేరుకోగా... పురుషుల విభాగంలో ఆరుగురు ఈ ఘనత సాధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement