రెండో రౌండ్‌లో భారత బాక్సర్‌ నీతూ  | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో భారత బాక్సర్‌ నీతూ 

Published Wed, May 11 2022 2:09 PM

Young Woman Boxer Neethu Enters 2nd Round Senior Boxing Championship - Sakshi

ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్‌ నీతూ శుభారంభం చేసింది. ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నీతూ 5–0తో స్టెలుటా దుతా (రొమేనియా)పై నెగ్గింది. నేడు జరిగే బౌట్‌లలో హెరెరా (మెక్సికో)తో నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), కళా థాపా (నేపాల్‌)తో మనీషా (57 కేజీలు), మరియా బోవా (ఉక్రెయిన్‌)తో పర్వీన్‌ (63 కేజీలు), కెర్రీ డేవిస్‌ (ఇంగ్లండ్‌)తో సవీటి (75 కేజీలు) పోటీపడతారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement