breaking news
Securitisation
-
పసిడి రుణాలు టాప్
కోల్‌కతా: దేశీయంగా పసిడి రుణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, సెక్యూరిటైజేషన్ మార్కెట్లో వాహన రుణాల విభాగాన్ని బంగారం రుణాల విభాగం అధిగమించింది. క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో ఇది వెల్లడైంది.క్యూ1లో సెక్యూరిటైజేషన్ పరిమాణంలో గోల్డ్ లోన్స్ వాటా 31 శాతంగా ఉండగా, వాహన రుణాల వాటా 26 శాతంగా నమోదైంది. మార్టిగేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ పరిమాణం 12 శాతంగా, బిజినెస్ లోన్ సెక్యూరిటైజేషన్ 10 శాతంగా, మైక్రోఫైనాన్స్ రుణాలు 14 శాతంగా రికార్డయ్యాయి. ఆర్థిక సంస్థలు తామిచ్చిన రుణాలను పూలింగ్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు విక్రయించి, తదుపరి మరిన్ని రుణాలివ్వడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడాన్ని సెక్యూరిటైజేషన్‌గా వ్యవహరిస్తారు.ఇలాంటి ఇష్యూలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఇందులో 98 శాతం ఇష్యూలను నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే (ఎన్బీఎఫ్సీ) జారీ చేశాయి. గతంలో ఇందుకు భిన్నంగా సింహభాగం వాటా బ్యాంకులది ఉండేది. -
ఆల్‌టైమ్ క్యూ1 గరిష్టానికి సెక్యూరిటైజేషన్
ముంబై: బ్యాంక్‌యేతర ఆర్థిక సంస్థల రుణాల మంజూరీ, వసూళ్ల వృద్ధి భారీ స్థాయిలో ఉంటుండటంతో సెక్యూరిటైజేషన్ పరిమాణం గణనీయంగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 60 శాతం ఎగిసి రూ. 55,000 కోట్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. రుణాలకు డిమాండ్ పెరగడంతో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణం. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తన ప్రస్తుత అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు ఏదైనా ఆర్థిక సంస్థ తాను ఇచ్చిన రుణాలపై రాబడులను మరో ఫైనాన్షియర్‌కు బదలాయించడాన్ని సెక్యూరిటైజేషన్‌గా వ్యవహరిస్తారు. తొలి త్రైమాసికంలో ఈ తరహా లావాదేవీలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 160 నుంచి 250కి పెరిగాయి. వాహన రుణాల సెక్యూరిటైజేషన్ 9 పర్సంటేజి పాయింట్లు పెరిగి 37 శాతానికి చేరింది. సెక్యూరిటైజేషన్ లావాదేవీలు ఇదే తరహాలో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం 2019 ఆర్థిక సంవత్సరం నాటి రూ. 1.9 లక్షల కోట్ల గరిష్ట స్థాయిని దాటేయవచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు.


