breaking news
Saurabh Dhingra
-
'ఫస్ట్ టైమ్' రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది: పాయల్ రాజ్‌పుత్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరైన 'ఫస్ట్ టైమ్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా ద్వారా పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరబ్ ధింగ్ర హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. హేమంత్ ఇప్పలపల్లి దర్శక-నిర్మాతగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకుండా కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో అత్యున్నత వీఎఫ్ఎక్స్ (VFX) విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి కష్టపడ్డారు. మే 22న ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇందులోని వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు. ఇక హీరో సౌరబ్ గురించి చెప్తూ.. తను సినిమాను ఒక ప్రతిజ్ఞలా తీసుకుని కష్టపడ్డాడని, భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆకాంక్షించారు.ఈ ఈవెంట్లో పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, చిత్ర బృందానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తదితరులు హాజరైన ఈ వేడుకలో 'ఈ పిల్ల నేను అనుకోనేలేదు' సాంగ్ మరియు ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. -
ట్రైలర్ కొత్తగా అనిపించింది
‘‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ కొత్తగా అనిపించింది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ షాకింగ్‌గా ఉన్నాయి. ప్రతిభని ప్రోత్సహించడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫస్ట్ టైమ్’ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందించా లని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైమ్’. సౌరభ్ ధింగ్ర హీరోగా, అనిక్క విక్రమన్ హీరోయిన్గా నటించారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాయల్ రాజ్‌పుత్ ట్రైలర్‌ని విడుదల చేశారు. హేమంత్ ఇప్పలపల్లి మాట్లాడుతూ– ‘‘మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అని కోరారు. ‘‘నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు సౌరభ్ ధింగ్ర. -
బాయ్‌ఫ్రెండ్‌ని హీరోగా పరిచయం చేస్తున్న పాయల్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..తొలి మూవీతోనే తెలుగు యువత మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. అంతకు ముందు పంజాబీలో సినిమాలు చేశారు. హిందీ సీరియళ్లలో నటించారు. అయితే, అక్కడ రాని గుర్తింపు... తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు ఓవర్ నైట్‌లో స్టార్డమ్ వచ్చింది. అక్కడ నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ‘మంగళవారం’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ..తన బాయ్‌ఫ్రెండ్‌ని తెలుగు తెరకు పరచయం చేయనుంది. సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యవాళ్లకు సౌరబ్ ధింగ్ర గురించి తెలిసే ఉంటుంది. పాయల్‌తో కలిసి చేసిన హాట్‌ఫోటో షూట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆయన ఇప్పుడు ‘ఫస్ట్ టైం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి కథ-దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 28 విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి పాయల్ రాజ్‌పుత్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.


