ట్రైలర్‌ కొత్తగా అనిపించింది  | Payal Rajput at First Time movie trailer launch | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ కొత్తగా అనిపించింది 

Apr 30 2026 4:09 AM | Updated on Apr 30 2026 4:09 AM

Payal Rajput at First Time movie trailer launch

– పాయల్‌ రాజ్‌పుత్‌ 

‘‘ఫస్ట్‌ టైమ్‌’ ట్రైలర్‌ కొత్తగా అనిపించింది. వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ షాకింగ్‌గా ఉన్నాయి. ప్రతిభని ప్రోత్సహించడంలో, మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫస్ట్‌ టైమ్‌’ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందించా లని కోరుకుంటున్నాను’’ అని హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. హేమంత్‌ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఫస్ట్‌ టైమ్‌’.

 సౌరభ్‌ ధింగ్ర హీరోగా, అనిక్క విక్రమన్‌ హీరోయిన్‌గా నటించారు. ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ అఖిల్‌ సార్థక్‌ సెకండ్‌ లీడ్‌లో నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న  పాయల్‌ రాజ్‌పుత్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. హేమంత్‌ ఇప్పలపల్లి మాట్లాడుతూ– ‘‘మన దేశానికి సంబంధించిన ఎన్నో మూలాలు ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలి’’ అని కోరారు. ‘‘నాకోసం ఈ కార్యక్రమానికి వచ్చిన పాయల్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు సౌరభ్‌ ధింగ్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement