బాయ్‌ఫ్రెండ్‌ని హీరోగా పరిచయం చేస్తున్న పాయల్‌ | Payal Rajput Boyfriend Saurabh Dhingra Debut Film First Time Trailer Release On 28th April | Sakshi
Sakshi News home page

‘ఫస్ట్‌ టైం’ హీరోగా పాయల్‌ బాయ్‌ఫ్రెండ్‌.. ట్రైలర్‌ ఎప్పుడంటే..?

Apr 26 2026 12:12 PM | Updated on Apr 26 2026 12:12 PM

Payal Rajput Boyfriend Saurabh Dhingra Debut Film First Time Trailer Release On 28th April

‘ఆర్‌‌ఎక్స్‌‌ 100’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి..తొలి మూవీతోనే తెలుగు యువత మనసు దోచుకున్న బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. అంతకు ముందు పంజాబీలో సినిమాలు చేశారు. హిందీ సీరియళ్లలో నటించారు. అయితే, అక్కడ రాని గుర్తింపు... తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత పాయల్ రాజ్‌‌పుత్‌‌కు ఓవర్ నైట్‌‌లో స్టార్‌‌డమ్ వచ్చింది. అక్కడ నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ‘మంగళవారం’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ..తన బాయ్‌ఫ్రెండ్‌ని తెలుగు తెరకు పరచయం చేయనుంది. 

సోషల్‌ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యవాళ్లకు సౌరబ్ ధింగ్ర గురించి తెలిసే ఉంటుంది. పాయల్‌తో కలిసి చేసిన హాట్‌ఫోటో షూట్‌ అప్పట్లో బాగా వైరల్‌ అయింది. ఆయన ఇప్పుడు ‘ఫస్ట్‌ టైం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి కథ-దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 28 విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కి పాయల్‌ రాజ్‌పుత్‌ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement