అందాల తార పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా హాజరైన 'ఫస్ట్ టైమ్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా ద్వారా పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరబ్ ధింగ్ర హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. హేమంత్ ఇప్పలపల్లి దర్శక-నిర్మాతగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకుండా కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో అత్యున్నత వీఎఫ్ఎక్స్ (VFX) విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి కష్టపడ్డారు. మే 22న ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇందులోని వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు. ఇక హీరో సౌరబ్ గురించి చెప్తూ.. తను సినిమాను ఒక ప్రతిజ్ఞలా తీసుకుని కష్టపడ్డాడని, భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆకాంక్షించారు.
ఈ ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, చిత్ర బృందానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తదితరులు హాజరైన ఈ వేడుకలో 'ఈ పిల్ల నేను అనుకోనేలేదు' సాంగ్ మరియు ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.


