breaking news
SAS
-
బలవంతపు బదిలీలు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో బదిలీలలపై ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని ఆ ప్రభుత్వమే అభాసుపాలు చేస్తోంది. గత నెలలో ప్రారంభమైన బదిలీలు అడుగడుగునా వివాదాస్పదంగా మారుతున్నాయి. చట్టంలో ఉన్న అంశాలను పక్కనబెట్టి అవసరం లేకున్నా టీచర్లతో బలవంతంగా అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు వేధిస్తున్నారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి, వారినుంచి అభ్యంతరాలను స్వీకరించినా చట్టంలో వాటికి చోటు కల్పించలేదు.బదిలీలకు ఉత్తర్వులు రాగానే అందులోని అంశాలపై సంఘాల ప్రతినిధులు ఆందోళన చేయడంతో కొన్ని ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పి ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లబరిచి.. తర్వాత ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలోకి తమకు అర్హత లేకున్నా బలవంతంగా బదిలీ చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. స్టేషన్ పాయింట్ల అంశంలోనూ అన్యాయం జరుగుతోందని, వీటిపై కోర్టులకు వెళితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1998 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు కౌన్సెలింగ్ విధానంలో జరుగుతున్నా అత్యంత వివాదాస్పదమైన బదిలీలు ఇవేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒత్తిడి చేసి మరీ వెబ్ ఆప్షన్లుస్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ద్వారా గ్రేడ్–2 హెడ్ మాస్టర్లుగా బదిలీ చేసేందుకు గతనెల 29న వెబ్ ఆప్షన్స్‌కు అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఉదయం ప్రారంభం కావాల్సిన ప్రక్రియ అర్ధరాత్రి దాటినా కొలిక్కి రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక పోస్టును భర్తీ చేసేముందు సీనియారిటీ, అర్హతలు పరిశీలించాలి. అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ స్కూల్ అసిస్టెంట్లకు ఎలాంటి దిశానిర్దేశం లేకుండా మే 31 ఒక్క రోజు గడువునిచ్చి ఆప్షన్లు పెట్టాల్సిందిగా ఒత్తిడి చేశారు. దీనిపై తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు రావడంతో మరో రోజు పొడిగించారు. ఫిర్యాదులు పరిష్కరించకుండా.. ఫైనల్ సీనియారిటీ జాబితా ప్రకటించకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అర్హత లేకున్నా ఆప్షన్ ఇవ్వాల్సిందే!ప్రస్తుత బదిలీల్లో సర్ప్లస్, లాంగ్ స్టాండింగ్‌తో పాటు స్వచ్ఛంద బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సర్ప్లస్ కాని, లాంగ్ స్టాండింగ్ కాని, కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులను సైతం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందేనంటూ డీఈవోలు తీవ్ర ఒత్తిడి చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. క్యాడర్ జూనియర్లంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,477 మంది స్కూల్ అసిస్టెంట్లను కచ్చితంగా పీఎస్ హెచ్ఎం పోస్టులకు ఆప్షన్ ఇవ్వాలంటూ శనివారం రాత్రి అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు జాబితాలు విడుదల చేయడంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. సబ్జెక్టు నిపుణులు పర్యవేక్షణకే పరిమితంకూటమి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఇప్పటివరకు హైసూ్కళ్లల్లో సబ్జెక్టు నిపుణులుగా ఉన్న 4,706 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పర్యవేక్షణకే పరిమితం కానున్నారు. ఉత్తర్వుల్లో స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు టీచర్లు, పీఎస్ హెచ్ఎంగా నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం కల్పించారు. కానీ దీనికి భిన్నంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో పీఎస్ హెచ్ఎం ఖాళీలకు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా విద్యాశాఖ మార్పు చేసింది. దీంతో బోధనపై ఇష్టం ఉన్న సబ్జెక్టు టీచర్లు పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లక తప్పని పరిస్థితి తలెత్తింది. ్డబదిలీల్లో ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులివీ⇒ బదిలీల్లో సర్ప్లస్ గాని.. లాంగ్‌స్టాండింగ్ గాని.. కనీసం బదిలీకి దరఖాస్తు చేసుకోని టీచర్లను సైతం వెబ్ అప్షన్లు ఇవ్వాలని డీఈవోలు ఒత్తిడి చేస్తున్నారు.⇒ పాఠశాల యూనిట్‌గా సర్వీస్‌ను బట్టి సీనియర్, జూనియర్ కేడర్ నిర్ణయించాలి. కానీ జిల్లాని యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా కేడర్‌లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు.⇒ సర్ప్లస్ పోస్టులను సీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేయాలి. ఇవేమీ చేయకుండా బదిలీ ప్రక్రియ నడుస్తోంది. దీనివల్ల ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుంది.సీనియర్లను జూనియర్లుగా మార్చేసి..పాత జీవోలు, ప్రస్తుత జీవో–22 ప్రకారం పాఠశాల యూనిట్‌గా సర్వీస్‌ను బట్టి సీనియర్/జూనియర్ కేడర్ నిర్ణయిస్తారు. కానీ.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జిల్లాని యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో చివరిసారిగా ఆ కేడర్‌లోకి వచ్చిన వారిని జూనియర్లుగా నిర్ధారించారు. ఇలా పాఠశాలలోని సీనియర్లను జిల్లా యూనిట్‌గా తీసుకుని జూనియర్లుగా మార్చేశారు. తొలుత ఉపాధ్యాయుల సర్ప్లస్ను 1:53 టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ప్రకటించింది, అనంతరం ఆ సంఖ్యను 1:49 నిష్పత్తికి కుదించింది. ఈ మేరకు సవరించి ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు సర్ప్లస్ పోస్టులను పీఎస్ హెచ్ఎంలుగా సర్దుబాటు చేయాలి. కానీ.. ఇవేమీ చేయకుండానే బదిలీ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీంతో ఎస్జీటీల పదోన్నతులకు గండి పడుతుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ ఇన్ఫ్రా జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ‘క్రౌన్’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటివరకు దక్షిణ భారతంలో 50 అంతస్తులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానాన్ని భాగ్యనగర ‘క్రౌన్’ సొంతం చేసుకుంది. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్.. హైదరాబాద్‌కు చెందిన సాస్ ఇన్ఫ్రా కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్ పేరిట జీ+57 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. భవనం ఎత్తు 228 మీటర్లు. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్మెంట్ విస్తీర్ణాలుంటాయి. ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించామని సాస్ ఇన్ఫ్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 60–70 యూనిట్లు విక్రయమయ్యాయని.. 2025 తొలి త్రైమాసికం నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా రానున్నట్లు చెప్పారు. ♦నానక్‌రాంగూడలో మూడు బేస్మెంట్లు 32 అంతస్తులలో ఆక్రోపోలిస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సుమధుర నిర్మాణ సంస్థ.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+44 అంతస్తుల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 5.06 ఎకరాల విస్తీర్ణం 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఒలంపస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో 854 యూనిట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.7,499లుగా నిర్ణయించామని సుమధుర వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు. చదవండి : Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ ఎక్కడ వస్తున్నాయంటే? ♦నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వస్తున్నాయి. ♦ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణమని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే ఈ తరహా నిర్మాణాలే సరైనవి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో నిర్మాణాలు కేవలం 20 శాతం లోపు ఉండటం మంచి పరిణామం. ఫలితంగా మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. హైరైజ్ ఉన్న చోట అభివృద్ధి.. హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయి. ల్యాండ్‌మార్క్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్ కపుల్స్ ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారని సుమధుర సీఎండీ మధుసూదన్ తెలిపారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే? ♦సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. ♦హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ♦ప్రతి అంతస్తుని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి. ♦ఆయా భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి. ట్రాఫిక్ అసెస్మెంట్ను పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే అనుమతులను జారీ చేయాలి. లాభాలు ఏంటంటే? ♦ఎత్తైన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, విధానపరమైన నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన ♦వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ♦ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. చుట్టూ పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ♦ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ♦ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు. -
ఐసిస్ చీఫ్ అంతానికి ‘కిల్ మిషన్’
లండన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాదీని మట్టుబెట్టేం దుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలసి బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఏఎస్).. ‘కిల్ మిషన్’ను ప్రారంభిం చింది. ఈ మిషన్ ఎస్ఏఎస్ స్నైపర్స్ నేతృత్వంలో సాగనుండగా.. కోవర్టు దళాలు సిరియా, ఇరాక్‌లోని ఐసిస్ స్థావరాలను పర్యవేక్షించనున్నాయి. ‘ప్రస్తుతం ఐసిస్ చీఫ్ ప్రధాన టార్గెట్. అబు బకర్‌ను అంతమొందించేందుకు ఎస్ఏఎస్ తమ ఇన్నేళ్ల అనుభవాన్ని, నైపుణ్యాన్ని వినియోగిస్తోంది’ అని రక్షణ శాఖ అధికారి ‘డైలీ స్టార్’ పత్రికకు తెలిపారు. అబు బకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం 25 మిలియన్ డాలర్లకు పెంచింది.