breaking news
Rs 20
-
ఇక చిన్న నోట్ల ఏటీఎంలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టినా జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు! తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్‌ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్‌ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది. పరిశీలనలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరును ఆర్బీఐ పరిశీలించింది. ముంబై పైలట్ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్..
మొబైల్ యూజర్లలో చాలామంది రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఈ రెండూ యాక్టివేట్‌లో ఉండాలంటే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇది యూజర్లకు భారమవుతోంది. దీనిని దృష్టిలో ఉందుకుని ట్రాయ్ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కేవలం 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుని సిమ్ కార్డును 120 రోజులు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.సిమ్ కార్డును కాల్స్, ఎస్ఎమ్ఎస్ లేదా డేటా వంటి వాటి కోసం ఉపయోగించకుండా, ఎటువంటి రీఛార్జ్ చేసుకోకుండా 90 రోజులు పక్కన పెడితే.. అది ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత సిమ్ కార్డును (నెంబర్) టెలికాం ఆపరేటర్లు వేరేవారికి కేటాయిస్తారు. ఆలా జరగకుండా ఉండాలంటే.. రూ. 20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం, మీరు 90 రోజులు సిమ్ కార్డును ఉపయోగించకుండా ఉంటే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి 20 రూపాయలు కట్ అవుతుంది. మరో 30 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతినెలా ఇలా రీఛార్జ్ చేసుకుంటే నెంబర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ కొత్త రూల్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా (VI) వంటి అన్ని సంస్థలకు వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లలో మార్పు: వివరాలివిగో..సమయానికి మీరు 20 రూపాయలతో రీఛార్జ్ చేయనప్పుడు గ్రేస్ పీరియడ్ 15 రోజులు లభిస్తుంది. ఆ తరువాత కూడా రీఛార్జ్ చేయకపోతే టెలికాం కంపెనీ సిమ్ కార్డును డీయాక్టివేట్ చేస్తుంది. ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ రూల్ కొత్తది కాదు. 2013 మార్చిలోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నియమాన్ని తీసుకొచ్చింది. కానీ దీనిని టెలికాం ఆపరేటర్లు పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు తప్పకుండా అన్ని సంస్థలు ఈ రూల్ పాటించాల్సిందే అంటూ ట్రాయ్ ఆదేశించింది. -
రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్..!
న్యూఢిల్లీ: రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 2016-17 బడ్జెట్లో రైల్వేలకు ప్రత్యేక ప్రతిపాదనలు చేయనున్నారట. ముఖ్యంగా వరుస ప్రమాదాలతో కునారిల్లుతున్నభారతీయ రైల్వే వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందు కు ప్రత్యేక నిధులతో రడీ అవుతోంది. రైలు భద్రత ప్రత్యేక ఫండ్ కోసం రూ .20,000 కోట్ల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్ కోసం రెండు పేజీలను ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. సాధారణ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ప్రాజెక్టులు, వ్యయ మరియు ఆదాయ లక్ష్యాలు సహా రైల్వే 'రాబోయే కార్యకలాపాలు గురించి ప్రస్తావన ఉంటుంది. రాబోయే బడ్జెట్ 2017-18 లో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ట్రాక్‌లు మరియు వంతెనల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రత్యేక భద్రతా నిధి కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నారు. కొత్త రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలపై పెద్దగా ప్రతిపాదనలు ఉండకపోవచ్చు కానీ, ప్రయాణికుల భద్రత ఫండ్ కు సంబంధించిన కీలకమైన ప్రకటన వెలువడే అవకాశంఉందని సీనియర్ రైలు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. రైలు నెట్వర్క్ అభివృద్ధిలో ఇది ఒక నమూనా మార్పుగా ఆయన అభివర్ణించారు. ఫెన్సింగ్ ల వద్ద మనుషులు, పశువుల చొరబాటును నిరోధించడంపై బడ్జెట్ పేపర్లలో ప్రముఖ ప్రస్తావన ఉండనున్నట్టు చెప్పారు. ప్రధాన రహదారు మార్గం వెంట మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపుతో పాటు , ఫెన్సింగ్, ట్రాక్ మరియు సిగ్నలింగ్ అభివృద్ధి , రెండు కారిడార్లు కోసం రూ 21,000 కోట్ల అంచనా వ్యయంతో నిధులను కేటాయించనున్నారు. . రైల్వే ట్రాక్‌లు, వంతెనల బలోపేతం, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. రూ. 34 వేల కోట్ల మూలధనంతో రైల్వే హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేసే ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలిపారు. దీని ప్రకారం ఐఆర్సీటీసీ, ఆర్ఐటీఈఎస్, కొంకర్, రైల్‌టెల్, ఎమ్ఆర్వీసీ సహా మొత్తం 14 ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. రైల్వేల వేగాన్ని నియంత్రించకుండా, ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలనేది ప్లాన్. తొలుత 160 కిలోమీటర్లకు, అనంతరం 200 కిలోమీటర్లకు పెంచే యోచన ఉన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం కిలోమీటర్‌కు రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాగా గత రెండు నెల్లో అయిదు ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా దాదాపు 200 మంది రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్టో విలీనం చేసిన యూనియన్ బడ్జెట్ ను మొదటిసారి ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనున్నసంగతి తెలిసిందే. -
మద్యానికి రూ. 20 ఇవ్వలేదని..
తండ్రి, అన్న చేతిలో యువకుడు హతం సీరోలు: మద్యం తాగేందుకు రూ.20 ఇవ్వలేదని పెద్ద కొడుకుతో కలసి చిన్న కొడుకును హత్య చేసిన ఉదంతమింది. వరంగల్ జిల్లా కురవి మండలం సిరోలులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సీరోలు శివారు కొర్లకుంట తండాకు చెందిన బానోత్ సక్రాం-అమ్మి దంపతులకు ముగ్గురు కుమారులు. గురువారంరాత్రి సక్రాం, పెద్ద కుమారుడు నాగేశ్ మద్యం తాగారు. మళ్లీ తాగేందుకు మద్యం కోసం రూ. 20 ఇవ్వాలని రెండో కొడుకు బానోత్ రమేష్ అలియాస్ చిన్ని(20)ని అడిగారు. అతడు నిరాకరించడంతో రాళ్లతో కొట్టారు. డాబాపై పడుకున్న తల్లి, తమ్ముడు సురేశ్‌లు కిందికి వచ్చి అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. తెల్లవారుజాముదాక రాళ్లతో కొట్టడంతో తాళలేక రమేశ్ మృతి చెందాడు. నాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


