breaking news
Riyaz
-
పాత నేరస్తుడు రియాజ్ కాల్చివేత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసిన పాత నేరస్తుడు షేక్‌రియాజ్ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. పరారీలో ఉన్న రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 4వ అంతస్తులో ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వార్డులోకి సాధారణ తనిఖీల్లో భాగంగా ఏఆర్ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్ మరో ఇద్దరు సిబ్బంది వెళ్లారు. గదిలో రియాజ్ తలుపులు, కిటికీలు పగులగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్‌ను బెడ్‌వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అయితే రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. వద్దంటూ వారించినా వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఏఆర్ ఎస్సై కాల్పులు జరపగా, షేక్ రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జడ్జి సమక్షంలో పంచనామా నిర్వహించి రాత్రి 7 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం పూర్తిచేసి రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో కాల్చివేత ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు సీపీ సాయిచైతన్య తెలిపారు. కత్తితో పొడిచి తప్పించుకొని.. ఈనెల 18న పాత నేరస్తుడు షేక్‌రియాజ్ ఇంటికి వచ్చాడని సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్సై విఠల్, ఇతర సిబ్బందికి సమాచారం వచ్చింది. బాబాన్ సాహెబ్ పహాడ్‌లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద రియాజ్ కనిపించడంతో కానిస్టేబుల్ ప్రమోద్ వెంబండించి పట్టుకున్నారు. అనంతరం బైక్‌పై తీసుకెళుండగా, రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ప్రమోద్ చనిపోయాడు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సారంగాపూర్ శివారులో పాతబడిన ఓ లారీ క్యాబిన్లో రియాజ్ ఉన్నట్టు స్థానికులు చెప్పగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రియాజ్ పారిపోతుండగా, ఆసిఫ్ అనే యువకుడు రియాజ్‌ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్ రెండు చేతులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు చుట్టుముట్టి రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడు.గాయపడిన ఆసిఫ్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. -
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు
-
అర్ధరాత్రి దాకా పోస్ట్‌మార్టం.. తెల్లవారక ముందే అంత్యక్రియలు పూర్తి
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో అతగాడు దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.జీజీహెచ్ ఆస్పత్రి మార్చురీలో గత అర్ధరాత్రి దాకా రియాజ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుండి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బోధన్ రోడ్డులో గల స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రియాజ్(24)పై 40 కేసులతో(దొంగతనాలు, దాడులు) పాటు రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీన అతని గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) సిబ్బంది ఇద్దరు రంగంలోకి దిగారు. అయితే అతన్ని బైక్‌పై తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్(48)ను తన దగ్గర ఉన్న కత్తితో పొడిచి పరారయ్యాడు. రెండ్రోజుల పాటు 8 పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ ఘటనను రాష్ట్ర పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. అయితే.. రెండ్రోజుల తర్వాత ఆదివారం.. అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ క్రమంలో గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఖైదీల వార్డులో చికిత్స చేయించారు. అయితే సోమవారం ఉదయం తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వద్ద గన్ లాక్కునే ప్రయత్నం చేసి పారిపోసాగాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు దిగడంతో బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ.. రియాజ్ కాల్పులకు దిగి ఉంటే మరిన్ని ప్రాణాలు పోయి ఉండేవని, పోలీసులు సకాలంలో స్పందించారని అన్నారు. మరణించిన ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయాల ఆర్థిక సాయం , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారాయన.ఇదీ చదవండి: తెలంగాణ మంత్రి వద్ద సీనియర్ నేత ఆవేదన చూశారా? -
రియాజ్ ఎన్ కౌంటర్ పై DGP కీలక ప్రకటన..
-
రియాజ్ ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటే..
-
కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్.. 24 గంటల్లో ఎన్ కౌంటర్
-
కానిస్టేబుల్ ప్రమోద్ కేసు: రియాజ్ ఖతం, డీజీపీ ఏమన్నారంటే..
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్‌పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్చైన్స్నాచర్ టు కానిస్టేబుల్ హత్య.. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్ 17వ) తేదీన నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు.అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ అంటూ ప్రచారం.. శుక్రవారం ప్రమోద్ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే.. ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు. నిందితుడు రియాజ్‌ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్‌ను కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయే క్రమంలో ఎన్కౌంటర్ కావడం గమనార్హం.ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా? -
తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్.. వెలిసిన ‘వాంటెడ్ రియాజ్’ పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్‌ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నచిన్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్‌ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
సిల్క్ సిటీలో 'ఉగ్ర' భయం
ధర్మవరం: పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచి ‘సిల్క్ సిటీ’గా పేరొందిన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు బహిర్గతం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. ధర్మవరంలోని లోనికోటకు చెందిన నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) బృందాలు అప్రమత్తమయ్యాయి. నూర్ మహమ్మద్ ఇంట్లో జరిపిన సోదాల్లో పలు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. సోదాల్లో ఉగ్ర సాహిత్యం పుస్తకాలు కూడా దర్యాప్తు సంస్థల అధికారులకు లభించాయి. అతడు జిహాద్ పేరుతో వాట్సాప్ ద్వారా నిరంతరం సందేశాలు దేశానికి వ్యతిరేకంగా పంపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు నూర్ మహమ్మద్‌ను ఉగ్రవాదులు పావుగా వాడినట్టు తెలుస్తోంది.డబ్బు ఆశ చూపి లొంగదీసుకున్నారా! నూర్ మహమ్మద్ కాయగూరల మార్కెట్ వద్ద చిన్నపాటి హోటల్లో పని చేసేవాడు. అరకొర సంపాదనతో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసేవాడు. రెండేళ్ల క్రితం వరకు కటిక పేదరికం అనుభవించిన అతడు తల్లి, చెల్లితో పాటు భార్య, నలుగురు పిల్లల్ని పోషించేందుకు చాలామంది వద్ద గతంలో చాలా అప్పులు చేశాడు. ఈ క్రమంలో భార్య సైతం అతనితో గొడవపడి వేరుగా ఉంటోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడన్న ప్రచారం ఉంది. ఏడాది క్రితం వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఇస్తెమాలకు వెళ్లినప్పటి నుంచి నూర్ మహమ్మద్‌లో మార్పు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ముభావంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం వంటివి అతనిలో గమనించినట్టు చెబుతున్నారు. రూ.లక్షలతో ఇల్లు ఆధునికీకరణ పేదరికంలో మగ్గుతూ వచ్చిన నూర్ మహమ్మద్ ఉన్నట్టుండి పాత ఇంటిని రూ.50 లక్షలకు పైగా వెచ్చిoచి ఆధునికీకరించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంటి పైపోర్షన్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైన గది నుంచే అర్ధరాత్రి నుంచి సెల్ఫోన్లో గంటల తరబడి మాట్లాడటం చేసేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మరికొందరు అతని దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఉగ్రవాదుల ఆర్థిక సహకారంతోనే సాకారమైనట్టు తెలుస్తోంది. తాడిపత్రిలో ప్రియురాలు నూర్ మహమ్మద్‌తో భార్య వేరుపడినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమెకు సైతం ఉగ్ర సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. నూర్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతని ప్రియురాలు అదృశ్యమైనట్టు సమాచారం. నూర్ తరచూ వాట్సాప్‌లో ఆమెతో సంభాషించిన ఆధారాలను కుటుంబ సభ్యులు బహిర్గతం చేశారు. ఆమె పట్టుబడితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.ఇంకా ఎందరుఉన్నారో!ధర్మవరంలోని లోనికోట, లింగశెట్టి పాళ్యం, ఎల్సీకే పురంలో ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రజలు పాతబస్తీగా పిలుస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యాకులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే నివసిస్తుంటారు. ఇక్కడ తక్కువ అద్దెకు ఇల్లు దొరకడం, మాస్ బెల్ట్ కావడంతో పేద, మధ్య తరగతి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో నూర్ మహమ్మద్‌తో పాటు ఉగ్ర సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎందరు ఉన్నారని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. స్థానికతతో పాటు ఎలాంటి ఆధారమూ లేకుండా ఉండేవారు ఎందరున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఎల్సీకే పురానికి చెందిన ఆటో డ్రైవర్ రియాజ్ తన వాట్సాప్ స్టేటస్‌లో ‘నో ఇండియా.. ఐ లవ్ పాకిస్థాన్’ అనే సందేశాన్ని పెట్టడంతో అతన్ని కూడా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఒకేరోజు నూర్ మహమ్మద్‌తో పాటు రియాజ్ వ్యవహారం బట్టబయలు కావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో ఉగ్ర మూకల్ని కూకటి వేళ్లతో పెకలించాలని ప్రజలు కోరుతున్నారు. ఉగ్ర కార్యకలాపాల నివారణకు ప్రత్యేక బృందాలు పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలను నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రత్న తెలిపారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారం మేరకు ధర్మవరం పోలీసులు ఉగ్రవాద భావాజాలాన్ని అరికట్టే క్రమంలో అనుమానితులపై నిఘా ఉంచారన్నారు. ఈ క్రమంలోనే ఆరు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలులుండి.. వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉంటూ, జిహాదీ సిద్ధాంత పుస్తకాలు కలిగిన నూర్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు. పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం ఉన్నట్టు నూర్ మహమ్మద్ అంగీకరించాడని తెలిపారు. ఈ గ్రూపుల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి, దేశ వ్యతిరేక ప్రచారం, జిహాదీ ప్రేరణ జరుగుతున్నాయన్నారు. ఉగ్రవాది నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్‌కార్డులు, జిహాదీ భావజాలం, ఉగ్రవాద సంస్థల ప్రచారంతో కూడిన నిషేధిత సాహిత్యం గల పుస్తకాన్ని స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. అతడి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక ఇచి్చన వెంటనే ఇతరులతో సంబంధాలు, ఉగ్ర లింకులు తదితర వివరాలన్నీ వెల్లడిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట ధర్మవరం ఇన్చార్జి డీఎస్పీ నరశింగప్ప, టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో రింగ్ రియాజ్
-
ఎన్నికల ప్రచారంలో రింగ్ రియాజ్
-
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం
సాక్షి, తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తిరువనంతపురంలో వీణను పెళ్లాడారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొంటారు. అనంతరం ట్విటర్లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణ పెళ్లి కూతురుగా ముస్తాబవనున్నారు. డీఎఫ్‌వైఐ (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహ్మద్ రియాజ్‌తో ఆమెకు వివాహం జరగనుంది. ఇందుకోసం జూన్ 15న ముహూర్తం ఖరారు చేయగా వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇక లాక్డౌన్ నిబంధనల కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా తిరువనంతపురంలో కొద్దిమంది అతిథుల మధ్యే పెళ్లి జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. (అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. రోడ్డుపై పెళ్లి!) పినరయ్ విజయన్, కమల విజయన్‌ల పెద్ద కుమార్తె వీణ. ఆమె బెంగళూరులో సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టి దానికి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి కొడుకు మహ్మద్ రియాజ్.. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినప్పటికీ ఆసక్తి రీత్యా ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. (రైలులో నిద్రించిన వృద్ధురాలు మెంటల్ హాస్పిటల్‌కు) -
అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..
శ్రీలంకలో ఉగ్రవాదుల మారణహోమం నేపథ్యంలోఐటీ సిటీలో రకరకాల వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ మెట్రో రైల్వేస్టేషన్లో కనిపించిన అనుమానితవ్యక్తి ఉగ్రవాది కావచ్చని జోరుగా ప్రచారం జరగడం, చివరకుఆ అనుమానితుడు అమాయకుణ్నని పోలీసులనుకలవడంతో కథ సుఖాంతమైంది. బనశంకరి: మెజస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానాస్పదంగా తెలుపురంగు జుబ్బా, పైజామా ధరించి సంచరించిన వ్యక్తి ఆచూకీ లభించింది. బుధవారం ఆ అనుమానిత వ్యక్తే డీసీపీ కార్యాలయానికి వెళ్లి మెట్రోస్టేషన్లో చోటు చేసుకున్న ఘటనను వివరించారు. సోమవారం రాత్రి మెజస్టిక్ మెట్రో స్టేషన్లో జుబ్బా, పైజామాతో ఉన్న వ్యక్తి మెటల్ డిటెక్టర్ వద్ద కు వెళ్లాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది అతడిని తనిఖీ చేయడానికి యత్నించగా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారణ ఆరంభించారు. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి రియాజ్‌అహ్మద్ (70), మెజస్టిక్‌లో గడియారాల విక్రయాలు, మరమ్మతులు చేసే వ్యక్తి అని తేలింది. ఆయన బెంగళూరు పశ్చిమవిభాగ డీసీపీ రవి డీ.చెన్నణ్ణవర్ కార్యాలయానికి వెళ్లి చోటు చేసుకున్న ఘటన ను వెల్లడించారు. తాను నాయండహళ్లిలో నివాసం ఉంటున్నానని, మెజస్టిక్‌లో గడియారాల రిపేరీలు చేస్తూ జీవిస్తుంటానని తెలిపారు. నిత్యం మెట్రో రైల్లో వెళ్లి వస్తుంటానని తెలిపారు. తాను ఉగ్రవాదిని కాదని, అనుమానిత ఉగ్రవాది అని మీడియాలో ప్రసారం కావడంతో ప్రజలు కొందరు తనపై దాడికి ప్రయత్నించారని, రక్షణ కల్పించాలని విన్నవించారు. గడ్డం పెంచుకున్నవారందరూ ఉగ్రవాదులా? గడ్డం పెంచుకోవడం తప్పేనంటూ తన భాద వెళ్లగక్కారు. దీంతో అతని వివరాలను నమోదు చేసుకుని పోలీసులు పంపించివేశారు. భయంతో తగ్గిన ప్రయాణికుల రద్దీ అంతకుముందు డీజీపీ నీలమణి రాజు మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ కలర్ జుబ్బా ధరించిన వ్యక్తి ఆచూకీ లభించలేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అనుమానితవ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని నగర సీపీ సునీల్‌కుమార్‌కు సూచించారు. మెట్రోస్టేషన్లో అనుమానిత వ్యక్తి సంచరించారనే సమాచారం నేపద్యంలో ప్రయాణికుల్లో భయం నెలకొంది. దీంతో మెట్రోలో సంచరించడానికి నగరప్రజలు భయపడుతున్నారు. మెజస్టిక్ కెంపేగౌడ బస్టాండ్, చిక్కలాల్‌బాగ్‌గేట్ వద్ద రెండుచోట్ల బుదవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వాటిలో అదనపు భద్రత కల్పించారు. భద్రతను పెంచాం: పోలీస్ కమిషనర్ మెజస్టిక్ మెట్రోస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనపించిన వ్యక్తి ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నామని ననగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరపోలీస్‌కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు వద్ద అదనపు సిబ్బందిని, కేఐఎస్‌ఎఫ్‌ను నియమించామన్నారు. అవసరానికి అనుగుణంగా నగరపోలీసులు అందుబాటులో ఉంటూ గస్తీలో ఉంటారని తెలిపారు. జుబ్బా, పైజామా దరించి గడ్డం కలిగిన వ్యక్తి పట్ల అనుమానం వస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని నగరప్రజలకు మనవిచేశారు. మెజెస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానితుని ఆచూకీ కోసం ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో ఓ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌కమిషనర్ః సీమంత్‌కుమార్, డీసీపీలు ఇషాపంత్, రాహుల్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కమిషనర్ సమావేశం అనంతరం అనుమానిత వ్యక్తి డీసీపీని కలవడంతో అనుమానాలు తొలగిపోయాయి. -
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి
-
లోకేశ్‌పై మరో బాంబు పేల్చిన జనసేన
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై జనసేన మరో బాంబు పేల్చింది. మంత్రి లోకేశ్ అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం లోకేశ్ అవినీతికి సంబంధించి తనకు అన్ని వ్యవహారాలు తెలుసునని, ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్ అవినీతి భాగోతం తమకు తెలుసునంటూ జనసేన నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి. -
నమ్మకంగా నటించి ఊడ్చుకెళ్లారు
సాక్షి, మైసూరు: ఆ ఇంటికి వస్తూ పోతూ నమ్మకంగా వ్యవహరించారు.. తరచూ వ్యాపార విషయంగా మాట్లాడేవారు. అదును చూసి అదే ఇంటికి కన్నం వేసి మొత్తం ఊడ్చుకుని పోయిన సంఘటన మైసూరులోని బన్ని మంటప లేఔట్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 23 లక్షల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రియాజ్ షరీఫ్, ఫయాజ్ షరీఫ్‌లు తండ్రి కొడుకులు. స్థానికంగా ఉండే మండి మోహల్లా పట్టెంగావ్ వీధిలో నివాసముంటున్న ఓ వ్యాపారితో తరచూ రియాజ్, ఫయాజ్‌లు వ్యాపారం పేరుతో కలుస్తూ ఉండేవారు. నమ్మకంగా నటిస్తూ ఆ ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించేవారు. ఈ క్రమంలో గత నెల 31న సదరు వ్యాపారి కుటుంబం మొత్తం పని నిమిత్తం మేలుకోటే వెళ్లారు. అదే సమయంలో తండ్రీకొడుకులు వ్యాపారి ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇదే అదునునగా భావించిన వారు 31 అర్థరాత్రి ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న రూ. 23 లక్షలు, రూ. 6 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు వచ్చిన వ్యాపారి కుటుంబం చోరి విషయం గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టి సోమవారం నిందితులను అరెస్టు చేశారు. చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. -
నడి రోడ్డుపై పొడిచి చంపారు
-
నడి రోడ్డుపై పొడిచి చంపారు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ వ్యక్తిని నడి రోడ్డుపై నరికి చంపేశారు. రియాజ్ అనే రియల్టర్ ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చిట్టీ డబ్బులు అడిగాడని కత్తితో దాడి
దర్శి (ప్రకాశం): చిట్టీ డబ్బులు అడిగాడని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రియాజ్, మస్తాన్ పాషాలు చికెన్ షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిట్టీ చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మస్తాన్ పాషా, రియాజ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పోతుల సురేష్ పేరుతో బెదిరింపులు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోతుల సురేష్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ధర్మవరం సీటీఓగా పని చేస్తున్న నాగేందర్ కుమార్‌ను రూ.30 లక్షలు ఇవ్వాలంటూ పోతుల సురేష్ పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నాగేందర్ కుమార్‌ను కలిసిన వారు... తాము అడిగిన డబ్బు సమకూర్చకుంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దాంతో బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత జీవీ చౌదరి, ఆర్ఎంపీ డాక్టర్ రియాజ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు. వారిని ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు.


