చిట్టీ డబ్బులు అడిగాడని కత్తితో దాడి | a man attack another with knife | Sakshi
Sakshi News home page

చిట్టీ డబ్బులు అడిగాడని కత్తితో దాడి

Sep 21 2015 10:15 PM | Updated on Sep 3 2017 9:44 AM

చిట్టీ డబ్బులు అడిగాడని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

దర్శి (ప్రకాశం): చిట్టీ డబ్బులు అడిగాడని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రియాజ్, మస్తాన్ పాషాలు చికెన్ షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిట్టీ చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మస్తాన్ పాషా, రియాజ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement