రెండో పెళ్లికి సిద్ధ‌మైన సీఎం కుమార్తె | Kerala CM Pinarayi Vijayan Daughter Veena To Marry DFYI Chief Riyaz | Sakshi
Sakshi News home page

పెళ్లి పీట‌లెక్క‌నున్న కేర‌ళ‌ సీఎం కుమార్తె

Jun 10 2020 2:12 PM | Updated on Jun 10 2020 2:33 PM

Kerala CM Pinarayi Vijayan Daughter Veena To Marry DFYI Chief Riyaz - Sakshi

తిరువ‌నంత‌పురం: కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ కుమార్తె వీణ పెళ్లి కూతురుగా ముస్తాబ‌వనున్నారు. డీఎఫ్‌వైఐ (డెమోక్ర‌టిక్ యూత్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా) జాతీయ‌ అధ్య‌క్షుడు పీఏ మ‌హ్మ‌ద్‌ రియాజ్‌తో ఆమెకు వివాహం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం జూన్ 15న ముహూర్తం ఖ‌రారు చేయ‌గా వీరిద్ద‌రికీ ఇది రెండో పెళ్లి. ఇక‌ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల కార‌ణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాల‌‌కు పోకుండా తిరువ‌నంత‌పురంలో కొద్దిమంది అతిథుల మ‌ధ్యే పెళ్లి జ‌రిపించ‌నున్నట్లు ముఖ్యమంత్రి స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. (అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. రోడ్డుపై పెళ్లి!)

పిన‌ర‌య్ విజ‌య‌న్‌, క‌మ‌ల విజ‌య‌న్‌ల‌ పెద్ద కుమార్తె వీణ‌. ఆమె బెంగ‌ళూరులో సొంతంగా స్టార్ట‌ప్ కంపెనీ పెట్టి దానికి డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. పెళ్లి కొడుకు మ‌హ్మ‌ద్‌ రియాజ్.. వృత్తి రీత్యా అడ్వ‌కేట్ అయిన‌ప్ప‌టికీ ఆస‌క్తి రీత్యా ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్ ఆఫ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా) స‌భ్యుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఐ(ఎమ్‌) అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌గా.. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎమ్‌కే రాఘ‌వ‌న్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. (రైలులో నిద్రించిన వృద్ధురాలు మెంట‌ల్ హాస్పిట‌ల్‌కు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement